తాళ్ల పద్మావతి కాలేజీ డైరెక్టర్ చైతన్యకు డాక్టరేట్

హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 30: హన్మకొండ జిల్లా కాజీపేటలోని తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(టీపీసీఈ), తాళ్ల పద్మావతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ బి.చైతన్యకు డాక్టరేట్ (పిహెచ్‌డి) ప్రకటించారు. విజయవాడలోని కేఎలఈఎఫ్‌లో ‘ఐసోక్సజోల్, థయాజోల్, థయాడియాజోల్, ఐసాటిన్, బెంజిమిడజోల్ డెరివేటివ్‌ల సంశ్లేషణ, జీవసంబంధ స్క్రీనింగ’ అంశంపై చైతన్య థీసిస్ సమర్పించారు. కేఎల్ విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావు, కిట్స్ వరంగల్, రసాయనశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.ప్రభాకరచారిల సంయుక్త పర్యవేక్షణలో ఆమె పరిశోధన పూర్తిచేశారు. తన పరిశోధనలో ఔషధ రసాయనశాస్త్ర రంగంలోని క్యాన్సర్ నిరోధక ఉత్పన్నాలపై కేంద్రీకరించారు.. ఆమె తన పరిశోధన కాలంలో సై ఇండెక్స్డ్ అండ్ స్కోపస్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జర్నల్స్‌లో నాలుగు పరిశోధన పత్రాలను, జాతీయస్థాయిలో నాలుగు కాన్ఫరెన్స్ పత్రాలను ప్రచురించారు.

ఈ సందర్భంగా చైతన్యను తాళ్ల పద్మావతి చైర్మన్ తాళ్ల మల్లేశం అభినందించారు. తమ కుటుంబంలో ఇద్దరు కుమారులు వంశీ, వరుణ్‌లు డాక్టరేట్లు పొందారని, ఇప్పుడు తమ కోడలు కూడా అత్యున్నత పట్టా సాధించారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది తాళ్ల పద్మావతి విద్యాసంస్థల సమూహం అనేక పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలతో మరింతగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి, తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.వేîలు, డైరెక్టర్లు డాక్టర్ తాళ్ల వంశీ, డాక్టర్ తాళ్ల వరుణ్-వైష్ణవి, సిబ్బంది, విద్యార్థులు చైతన్యను అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *