చర్చలు సానుకూలంగా సాగాయి

` ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకు ఆగండి
– ప్రైవేటు కళాశృాలల యాజమాన్యాలకు భట్టి సూచన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: తనతోపాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కార్యదర్శులు, ప్రైవేట్‌ కళాశాలల యజమాన్యాలు అందరం కలిసి ఆదివారం అయినప్పటికీ నిన్న సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు చర్చించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. చర్చలు సానుకూలంగా కొనని, ప్రైవేటు కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నామని పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు సమ్మెను విరమించాలని ప్రైవేటు కళాశాలల యజమానులను కోరామన్నారు. దానికి వారు సానుకూలంగా స్పందించారంటూ భట్టి అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *