– లేదంటే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం
– మాజీ మంత్రి తలసాని హెచ్చరిక
నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కుమ్మెర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ కేంద్రంలో కుమ్మెర బాధితుల పక్షాన గురువారం చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజులలో దోషులపై చర్యలు తీసుకోకుంటే హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల కొనసాగుతున్న వివక్ష, దాడులు, దౌర్జన్యాలు, ఆలయాల్లో ప్రవేశంపై ఆంక్షలు కొనసాగడం బాధాకరమని అన్నారు.దేవుడిని దర్శించుకునే అర్హత బలహీన వర్గాలకు లేదా ? అని ప్రశ్నించారు. కుమ్మెర దోషులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.