హైదరాబాద్‌ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత, అక్టోబర్‌ 3: హైదరాబాద్‌లో జరుగుతున్న జీటో కనెక్ట్‌ కార్యక్రమం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు ఆయనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. హైటెక్స్‌లో మధ్యాహ్నం జరిగే జీటో కనెక్ట్‌(JITO CONNECT) ప్రారంభ సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 3 గంటల సమయంలో బేగంపేటకు చేరుకుని అక్కడినుంచి దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *