కూకేటి పాము

మత్తు మందు జల్లి నొప్పిలేని గాయం చేసి పానాల గుత్త కూకేటి పాము కాటికి కట్టెలు పేర్చుతున్నది జిడ్డుకాయ పట్టిన పెదాలతో పొగ జుర్రుకుంటున్న యువత కార్జాలు పొగజూరి ఆవిరి పీల్చుతూ తమ ఆయువుకు తిలోదకాలు వదులుతున్నది మెత్తటి దవడల్లో సుతిమెత్తని మెదళ్లలో మశిలా పూశి కారు చీకటిలో జోరు షికారు చేస్తూ…



