ఉప్పరుల దుఃఖాన్ని కొలిచిన మెట్న -బోల యాదయ్య

శ్రమ ఎప్పుడు అజరామరంగ జీవిస్తుంది. శ్రమను ప్రేమించిన వాళ్ళు చరిత్రను తనవెంట తిప్పుకుంటూ ప్రపంచం ముందర తరాలవారధిగా నిలబడతారు. ఏండ్లనాటి జీవన స్థితిగతులు, సామాజిక వృత్తినైపుణ్యాలు అప్పుడప్పుడు అస్తిత్వశోధనలో భాగంగా బయటపడతాయి. అందులో భాగంగానే యువకవి మిత్రుడు, ఉప్పరి తిరుమలేష్ తన జాతి పుట్టుక పూర్వోత్తరాలు, జీవనవిధానంలో శ్రమైకజీవన సౌందర్యాన్ని ‘మెట్న’ దీర్ఘకావ్యంలో మనముందుంచాడు. ఇంతకుముందే చిరుమొగ్గలు,…
