Tag Today Hilights

బిఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేతగా కెసిఆర్‌

ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్‌ నేతల నివాళి ఎంఎల్‌సి పదవులకు పల్లా, కౌశిక్‌రెడ్డి, కడియం రాజీనామా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికయ్యారు. శనివారం బీఆర్‌ఎస్‌ పీపీ నేత కేశవరావు అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ను ఎల్పీ నేతగా…

మాట ఇచ్చి స్వరాష్ట్ర కల నెరవేర్చిన సోనియా గాంధీ

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన తల్లి ఆమె పుట్టిన రోజు డిసెంబర్‌ 9న రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిన పండుగ రోజు తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది ఆమె ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు నేటి నుంచి అమలు వంద రోజుల్లో అమలులోకి మిగితావి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి…

సిఎంగా రేవంత్‌రెడ్డి రెండు రోజుల ప్రయాణం- రెండు పథకాలు

 గెస్ట్‌ ఎడిట్‌, మండువ రవీందర్‌రావు ఇరవై నాలుగేళ్ళపాటు తెలంగాణ ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునే కాకుండా, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను ఒక దశాబ్ధకాలం ఏకచ్ఛాత్రాధిపత్యంగా ఏలిన కెసిఆర్‌ను మరుగునపడేసి అత్యధిక ప్రజల మద్దతును కూడగట్టుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎనుముల రేవంత్‌రెడ్డి  రెండు రోజుల్లోనే ప్రజలకిచ్చిన మాటను నిలుపుకోవడం ద్వారా మరోసారి ప్రజల…

ఎవరెన్ని విమర్శలు చేసినా బిజెపిదే భవిష్యత్‌

పార్లమెంటులో క్లీన్‌ స్వీప్‌ చేస్తాం బిజెపి నేత ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ఎన్ని విమర్శలు వొచ్చినా, తప్పుడు ప్రచారం చేసినా బీజేపీకి ప్రజలు ఎనిమిది సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీకీ ఓట్లు సీట్లు పెంచేందుకు కృషి చేసిన…

మంత్రులకు శాఖల కేటాయింపు

ఆర్థిక, విద్యుత్‌ శాఖలు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు ఉత్తమ్‌కు నీటిపారుదల, సీఏడీ, ఫుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లై శాఖలు ఐటి, శాసనసభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌ బాబు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి` రెవన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖలు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ఎట్టకేలకు శనివారం రాష్ట్ర మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటి…

పాలస్తీనా పౌరులు ఏం పాపం చేశారు…?

హమాస్‌ దాడుల తరువాత ఇజ్రాయిల్‌ పాలస్తీనాలో ఉన్న హమాస్‌ను  అంతం చేయాలని బహిరంగ యుద్ధాన్ని ప్రకటించిన తరువాత హమాస్‌ను  అంతం చేసిందో లేదో తెలియదు గాని ఈ పరిస్థితుల్లో పాలస్తీనాలోని  పాపం పుణ్యం ఎరుగని పెద్దలు, ఏమి జరుగుతుందో తెలియని పసివాళ్లు బలైపోతున్నారు. గాజా లో హమాస్‌ చేతిలో ఉన్న 240 మంది బందీలలో కొంత…

కెసిఆర్‌ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ ట్వీట్‌

హైదరాబాద్‌, పిఐబి, డిసెంబర్‌ 8 : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కలిగిన గాయం బారి నుండి త్వరితగతిన కోలుకుని త్వరగా తిరిగి స్వస్థత చేకూరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. గురువారం కెసిఆర్‌ కాలికి గాయం విషయం తెలిసిన అనంతరం ప్రధాన మంత్రి ఎక్స్‌ మాధ్యమం ద్వారా చేసిన ఒక సందేశంలో ప్రధాని..‘తెలంగాణ…

ఇంట్లో జారిపడ్డ మాజీ సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం అర్ధరాత్రి ఫామ్‌ హౌస్‌ బాత్‌ రూమ్‌లో జారి పడటంతో ఆయన తొంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అక్కడ కేసీఆర్‌కు చికిత్స కొనసాగుతున్నది. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

ఇప్పుడే తెలంగాణ ఏర్పడ్డట్లుగా ఉంది

ప్రజల్లో ఆనందం కూడా ఇదే తెలియజేస్తుంది మేడిగడ్డపై విచారణ జరపాలన్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వొచ్చిన్లటైందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజంగా ఇప్పుడే తెలంగాణ వొచ్చిందన్న భావనలో ప్రజలు కూడా ఉన్నారని అన్నారు. ప్రజాభవన్‌ వద్ద సందడి చూస్తుంటే ఆనందంగా…