Tag Telugu News Headlines Breaking News Now

భదాద్రి వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి

వరద ముంపులోనే మారుమూల గ్రామాలు చెరువులను తలపిస్తున్న పంటపొలాలు పునరావాస కేంద్రాల్లోనే వరదముంపు బాధితులు కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్‌, ‌కలెక్టర్‌ అనుదీప్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 12 : ఎడతెరుపు లేకుండా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రమాదస్థాయి చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు.…

తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం

నేడు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. షెయర్‌ ‌జోన్‌, ‌ద్రోణి ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉందని,…

సింహాద్రి అప్పన్నకు సంప్రదాయ చందనోత్సవం… భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం

‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ ‌నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమా మ్యహమ్‌’’… ‘‘‌సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్‌’’… దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన సింహాచల క్షేత్రంలో స్వామి వారికి ఆషాఢ పౌర్ణమి నాడు చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ…

త్వరలో 800 కోట్లకు ప్రపంచ జనాభా..

“ప్రపంచ దేశాల జనాభాతో అంతర్జాతీయ వలసలు ముడిపడి ఉంటాయని, 2000-20 మధ్య కాలంలో సంపన్న దేశాలకు 80.5 మిలియన్ల ప్రజలు వలసలు వెళ్లారని, దీనితో ఆ దేశాల్లో మరణాల రేటు కన్న జననాల రేటు పెరగడం గమనించారు. గత కొన్ని ఏండ్లుగా అధిక ఆదాయ దేశాల్లో జనాభా పెరగడానికి ప్రధాన కారణంగా విదేశీ వలసలు నిలుస్తున్నాయి.…

నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పాఠశాలల ఖాతాల్లో నిల్వ ఉన్న నిధులను విద్యాశాఖ వెనక్కి తీసు కోవ డంతో ప్రధానో పాధ్యా యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వున్నారు. కొన్ని సంవత్స రాలుగా పాఠశాలల ఖాతాల్లో ఉన్న నిధులను గత విద్యా సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ ‌చివరిలో విద్యాశాఖ వాపసు తీసుకుంది. వీటిని వినియోగించుకునే అవకాశం…

నవజీవన వేదం..!

కంటిలో  రెటీనా పొరను కరెన్సీ తెరలు కమ్మినాక నీ ప్రతి వీక్షణంలో.. కపటపు క్రీనీడలు తప్పా ! కరుణ కాంతికి జాడెక్కడిది ? మస్తిష్కవేళ్ళ మొదళ్లలో మౌఢ్యకుళ్లు అల్లుకున్నాక నీ ప్రతీ ఆలోచనలో… అంతరాల దొంతరలే తప్పా! సమైక్య జీవనకు చోటెక్కడిది? నవనాడులు మూలాల్లో స్వార్థ వ్యర్థాలు పోగయ్యాక నీ ప్రతీ అడుగులో.. విద్రోహ ముద్రికలే…

దేశాభివృద్ధికి అవరోధంగా పేదరికం

‘‘ఏ ‌దేశ ప్రగతికైనా అవరోధంగా పేదరికం నిలుస్తుంది. దేశాభివృద్ధికి విఘాతం పేదరికమే. పేదరికం లేని దేశం స్వర్గతుల్యం. పేదరికం ఓ ఆర్థిక సమస్య మాత్రమే కాదు. పేదరికంతో దేశ ఆయుర్దాయం, విద్య, జీవన ప్రమాణాలు, లింగ సమానత్వం, అసమానతలు, ఆరోగ్యం లాంటి పలు ముఖ్య అంశాలు నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలుసుకోవాలి. పేదరిక నిర్మూలన…

అమర్‌నాథ్‌ ‌యాత్ర పునరుద్ధరణ

భద్రత మధ్య తిరిగి కొనసాగింపు శ్రీనగర్‌, ‌జూలై 11 : జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ ‌యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటికీ పలువురి ఆచూకీ దొరకలేదు. వరదలతో తాత్కాలికంగా యాత్రను రద్దు చేశారు. ఆ…

వర్షాలతో నేటి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ ‌పర్యటన రద్దు

రాష్ట్రపతి అభ్యర్థి ముర్మకు టిడిపి మద్దతు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళ ద్రౌదరిముర్ముకు మద్దతు ఇవ్వాలని టిడిపి తీర్మానించింది. ఈ అంశంపై తెదేపా తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తెదేపా వ్యూహ కమిటీలో చర్చించిన అనంతరం తెదేపా…