Tag Telugu News Headlines Breaking News Now

గోదావరి వరద తగ్గుముఖం

పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు ఇంకా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : వారం రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ వొస్తుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నెమ్మదించింది. గోదావరితో పాటు ఉప్పొంగి ప్రవహించిన వాగులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం(సరస్వతి) బ్యారేజీలోకి శనివారం…

భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి

మళ్ళీ పెరుగుతున్న  వరద –  5అడుగులు పెరిగే అవకాశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18 : గతవారం రోజులుగా గోదావరి వరద భయభ్రాంతులకు గురి చేసింది. అనేక గ్రామాలను వరదతో ముంచెత్తింది. నేటివరకు ఇంకా వరదముంపులోనే గ్రామాలు ఉన్నాయి. పంటపొలాలు కూడ చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం నుండి భద్రాచలం వద్ద గోదావరి మెల్లగా తగ్గుముఖం పట్టింది.…

వాయిదాల పర్వంతో… మొదలైన పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు

రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణం వివిధ అంశాలపై చర్చకు విపక్షల పట్టుతో ఉభయ సభలు నేటికి వాయిదా న్యూ దిల్లీ, జూలై 18 : పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల తొలిరోజే వాయిదాలతో మొదలయ్యాయి. తొలిరోజు గందరగోళం మధ్య ఉబయసభలు వాయిదా పడ్డాయి. ఎగువసభ రాజ్యసభలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపుపై•…

రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన అకాలీదళ్‌ ఎమ్మెల్యే

చండీఘడ్‌,‌జూలై18 :  జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో అకాలీదళ్‌ ఎమ్మెల్యే మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ అయ్యాలీ పాల్గొనలేదు. ఆ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో ద్వారా తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి ముర్ము లేదా విపక్ష అభ్యర్థి యశ్వంత్‌కు ఓటు వేయడం లేదని ఆయన ఆ వీడియోలో వెల్లడించారు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు…

కొరోనా కేసులు తగ్గుముఖం

న్యూఢిల్లీ,జూలై18:  దేశంలో కొరోనా  కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 16,935 మందికి పాజిటివ్‌ ‌వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,37,67,534కు చేరింది. ఇందులో 4,30,97,510 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,25,760 మంది మృతిచెందారు. ప్రస్తుతం…

మధ్యప్రదేశ్‌ 7 ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్లు గెలిచిన బీజేపీ కాంగ్రెస్‌ 3, ఆప్‌ 1 ‌లో విజయం

భోపాల్‌ ,‌జూలై 18: మధ్యప్రదేశ్‌ ‌మున్సిపల్‌ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ  మొత్తం 133 స్థానిక సంస్థలలో  105 స్థానాల్లో విజయం సాధించింది, అయితే రాష్ట్రంలో నాలుగు కీలకమైన మేయర్‌ ‌పదవులను కోల్పోయింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌మూడు మేయర్‌ ‌పదవులను గెలుచుకోగా, మొదటిసారి పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఒకటి గెలుచుకుంది. 11 మునిసిపల్‌…

పొలిటికల్‌ ‌బరస్ట్

‌రాష్ట్రంలో వరదల కారంణంగా ముంపుకు గురైన ప్రాంతాలను చూడడానికి వెళ్ళిన సందర్భంగారాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్ల్లోకూడా దీనిపై దుమారం లేస్తున్నది. గత వారంరోజులుగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాల వల్ల గోదావరి…

రైలులో నేడు ఉదయం మణుగూరుకు చేరుకోనున్న గవర్నర్‌

‌గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌నేడు భదాద్రి-కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. శనివారం న్యూ దిల్లీలో రాష్ట్రపతి రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ ‌వీడ్కోలు విందుకు ఆమె హాజరు కావల్సి ఉన్నా ఆ పర్యటనను రద్దు చేసుకుని ఆమె హదాద్రి వరద ప్రాంతాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. భద్రాచలం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో వరద…

కరకట్ట ఎత్తు పెంచాలి సుభాష్‌ ‌నగర్‌ ‌కాలనీ వాసుల ధర్నా

ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరదకు ప్రస్తుతం ఉన్న కరకట్ట ఎత్తు ఏమాత్రం సరిపోదని తక్షణమే కరకట్ట ఎత్తు పెంచాలని కోరుతూ శనివారం నాడు కూనవరం రోడ్డులో డిగ్రీ కాలేజ్‌ ‌వద్ద సుభాష్‌ ‌నగర్‌ ‌కాలనీ వాసులు భారీ ధర్నా నిర్వహించారు. రహదారులపై బైటాయించి నినాదాలు చేసారు. కరకట్ట ఎత్తు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌…