Tag Telugu News Headlines Breaking News Now

థాయిలాండ్‌లో గొటబయ రాజపక్సె ఆశ్రయం

శ్రీ‌లంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స థాయ్‌లాండ్‌ ‌లో తాత్కాలికంగా బస చేయనున్నారు. ఆయనకు ఆశ్రయమిచ్చేందుకు థాయ్‌ ‌ప్రభుత్వం అంగీకరించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో జూలై 13న శ్రీలంక వదిలి మాల్దీవులు.. అక్కడ్నుంచి సింగపూర్‌ ‌కూ వెళ్లారు. ప్రస్తుతం సింగపూర్‌ ‌వీసా గడువు ముగియనుండటంతో.. ఆశ్రయం…

అమ్మ ఒడి ఎక్కడా లేని పథకం

ప్రభుత్వ దవాఖానాలు  బలోపేతం సహజ ప్రసవాలను ప్రోత్సహించేలా  చర్యలు ఇప్పటివరకు 13.30 లక్షల మందికి కేసీఆర్‌ ‌కిట్లు ఏ ‌రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్దిదారులతో మంత్రి కేటీఆర్‌ ‌జూమ్‌ ‌కాన్ఫరెన్స్…

అబద్ధాలకు, ఫేక్‌ ‌ప్రచారానికి కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌బిజెపి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 11: అబద్ధాలు చెప్పడంలో, ఫేక్‌ ‌ప్రచారానికి బిజెపి పార్టీ కేరాఫ్‌ అ‌డ్రస్‌ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు బిజెపి పార్టీపై విరుచుకుపడ్డారు. గురువారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేటకు చెందిన కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీకి చెందిన పలువురు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌లో…

తెలంగాణ ఉప్పుడు బియ్యానికి కేంద్రం ఓకే

తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2021-22 రబీ సీజన్‌లో పండించిన 8లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. గతంలో ఇచ్చిన 6.05లక్షల మెట్రిక్‌ ‌టన్నులకు అధనంగా బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు కేంద్రం లేఖలో పేర్కొంది.…

దేశానికి బీహార్‌ ‌మార్గం చూపింది

యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాం: బిహార్‌ ‌డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ ‌పాట్నా,అగస్ట్11: ‌గతంలో ఎన్నడూ జరగని తరహాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని  బిహార్‌ ‌డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌  ‌తెలిపారు.ప్రస్తుతం దేశానికి ఏది అవసరమో బిహార్‌ అదే చేసింది..దేశానికి తాము ఓ దారి చూపామని ఆయన అన్నారు. నిరుద్యోగంపైనే తమ పోరాటమని, పేదలు,…

ఎపి సర్కార్‌ ‌నుంచి బకాయిలు ఇప్పించండి

సుప్రీమ్‌కోర్టును ఆశ్రయించిన అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ ‌న్యూ దిల్లీ,అగస్ట్11: ఆం‌ధ్రప్రదేశ్‌ ‌నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ.. అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ ‌సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆర్బిట్రేషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ ‌పై స్పందించిన సుప్రీంకోర్టు.. అమరావతి మెట్రోపాలిటన్‌ ‌రీజియన్‌ అభివృద్ధి అథారిటీకి నోటీసులు జారీ చేసింది. ఫోస్టర్‌…

రక్షాబంధన్‌ ‌శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూ దిల్లీ,ఆగస్ట్11: ‌దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌది ముర్ము,ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు గురువారం రక్షా బంధన్‌ ‌పండుగను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మోడీ ట్విట్టర్‌ ‌ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయత, నమ్మకానికి, అన్నాచెల్లెల్లు,అక్కాతమ్ముడు మధ్య విడదీయరాని బంధానికి ప్రతీక అయిన రక్షా…

సైనికుడా… వందనం

కష్టాల సహారా ఒడిదుడుకుల ఇసుక తుఫానుల్ని ఆత్మస్థైర్యపు అడుగులతో ఎదుర్కొంటూ నీ జీవితం ఈ దేశపు పహారా అయిపోయింది… అనుక్షణం తొలిచేస్తున్నా ఉద్విగ్నం శత్రువు పదఘట్టనలపైనే చేస్తూ దృష్టిని నిమగ్నం నీ హృదయం ఆత్మవిశ్వాసపు పతాకమై రెపరెపలాడుతుంటుంది… గడ్డకట్టిన మంచులో నీ జీవన సమరాన్ని తిలకిస్తూ పగలూ, రాత్రీ.. అన్ని కాలాలూ నిన్ను మనసారా హత్తుకుంటూ…

భరతమాత ప్రశ్నిస్తోంది

స్వాతంత్య్రం సిద్దించి అప్పుడే వజ్రోత్సవ సంబరాలకు చేరువైందా? మారని మాటకొటుందని ప్రశ్నిస్తోంది నన్ను ఇన్నేళ్లు గడిచినా నేనింకా అభివృద్ది చెందలేదెందుకని? నా వొడిలో బతుకీడుస్తున్న సగటుమనిషి జీవనం గతెందుకు మారలేదని స్వేచ్ఛగా బతకలేక ఆకలితో అల్లాడే దీనుల పట్టింపెందుకులేదని బహుజనులకు అధికారం అందనిద్రాక్షేనా బలమొకరిది పెత్తనం ఇంకొకరిది ఇదేం న్యాయమంటూ ప్రశ్నిస్తోంది డెబ్బైఐదేళ్ళలో ఎందుకింక నీచరాజకీయాలంటూ…