Tag Telugu News Headlines Breaking News Now

బయ్యారం ‘ఉక్కు’ సంకల్పం

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం వైఖరిలో ఏమాత్రం మార్పులేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కేంద్రం ఇచ్చిన విభజన హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడంకూడా ఒకటి. గడచిన ఎనిమిదేళ్ళుగా ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక దఫాలుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దిల్లీ కి వెళ్ళినప్పుడు,…

కొనసాగుతున్న రూపాయి పతనం

రూ.81.52 వద్ద ప్రారంభమైన రూపాయి క్రితం సెషన్‌ అమెరికా ఫెడ్‌ ‌ప్రభావమేనని అంచనా ముంబై, సెప్టెంబర్‌ 26 : ‌రూపాయి పతనం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా రేట్ల పెంపుతో ఊపందుకున్న పతనం ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలతో కొనసాగుతోంది. సోమవారం…

షర్మిలా బిజెపి వొదిలిన బాణమే: జగ్గారెడ్డి ఫైర్‌

మమ్మల్ని గెలికితే వైస్‌ఆర్‌ను తిట్టాల్సి వొస్తది నేను ఏ పార్టీలో ఉంటే నీకేం•ంట? వైఎస్‌ ‌షర్మిలపై జగ్గారెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ‌టిఆర్‌ఎస్‌లో బుద్ధిగా పని చేసుకుంటూ ఉన్న నన్ను పిలిచి నా శీలం(రాజకీయ)ను కరాబు చేసిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ అని ఆ సంగతి వైఎస్‌ ‌షర్మిలకు తెలియదా? అని…

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

ట్రాఫిక్ లో గంటలకొద్దీ ఇరుక్కుపోయిన వాహనదారులు  హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 26; హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. వాన హోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. అసెంబ్లీ, బషీర్బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో జోరు వాన పడింది.పంజాగుట్ట, జూబ్లీహిల్స్, లక్డీకపూల్,…

రూరల్‌ ‌టెక్నాలజీ పాలసీతో ద్వితీయశ్రేణి నగరాలకు మేలు

జిల్లా కేంద్రాల్లో ఐటి సెంటర్లకు ప్రాధాన్యం ఆదిలాబాద్‌ ‌బీడీ ఎన్టీ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టులను బదిలీ చేయకుండా చూడాలని లాయర్ల వినతి ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ఆదిలాబాద్‌ ‌జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.…

ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రక్‌..‌పదిమంది మృతి

ఉత్తరప్రదేశ్‌ ‌రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇంటౌజా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న సమయంలో ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. సీతాపూర్‌లోని అటారియాకు చెందిన ఓ కుటుంబం ఇంటౌజాలోని ఉనై దుర్గాదేవి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మంది…

మానవతా శిఖరం కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ

నేడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ జయంతి పదవులు తృణపాయం!… ప్రజా శ్రేయస్సు ప్రాణం!… మాట తప్పనివాడు!… మడమ తిప్పని వాడు!… నిరంకుశ నవాబును గడగడలాడించిన వాడు!… ప్రజాస్వామ్య ప్రియుడు!… ప్రజాభ్యుదయ కంకణ ధారుడు!… వంచన, మోసం, కపటం, కుట్రలు తెలియనివాడు!… నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం!… దేశం కోసం కన్న కొడుకు ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు!……

ప్రాచీన చారిత్రక సాక్ష్యాల ఆత్మఘోష

 ‘‘‌నాటి ప్రజల ఆరాధ్యాలైన స్థూపాలు, శిల్పాలు, కట్టడాలు, తవ్విన చోటల్లా దర్శనమిస్తూ, వెలకట్ట లేని వేల సంవత్సరాల చరిత్రకు, మౌన సాక్షీ భూతాలుగా నిరాదరణ నీడలో మగ్గుతూ, తమ దుస్థితికి చింతిస్తూ, అనాసక్తులైన, అధికారుల, ప్రజా ప్రతినిధుల అశ్రద్ధ, నిర్లక్ష్యానికి క్రుంగి కృశిస్తు, ఆయువు తీరకముందే అస్తమిస్తున్నాయి. ’’ అవి భక్త కరీంనగర్‌ ‌జిల్లా గత…

పక్క పార్టీలతో ఐక్యతారాగం.. స్వీయపార్టీలో ముసలం

భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కలిసివచ్చే పార్టీలన్నీ ఐక్యం అయ్యేందుకు ఒక పక్క మంతనాలు జరుగుతుంటే, కాంగ్రెస్‌లో మాత్రం నిత్యం ఎక్కడో ఒక దగ్గర అంతర్ఘత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు దేశంలోని పలు పార్టీలు చాలా కాలంగా వ్యూహరచన చేస్తున్నాయి. అయితే కేంద్రంలో ఎదురులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని…