మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షమెప్పుడు..?
అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నప్పటికీ వారికి కావల్సినంతగా అవకాశాలు రావడంలేదు. ఆకాశంలో సగం అని చెబుతున్నప్పటికీ మగవాళ్ళతో సమానంగా పోటీ పడే అవకాశాలు వారికి లభించడంలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇది కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అక్కడ వారి ప్రతిభను చూపించుకునే వీలు లేకుండా పురుషుల పెత్తనం అడ్డుపడుతోంది. ఉదాహరణకు గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా వారు…





