Tag telugu kavithalu

సాలు సాలుకు వెతల సాగు

కష్టమైనా ఇష్టంగ,ఇగురంగ ఆరుగాలం ఎవుసం చేస్తుండు గాదెల నిండా ధాన్యం నింపి అందరి ఆకలి తీరుస్తున్న అన్నదాత అనే బిరుదాంకితుడు అంగట్లో ధరల శరాఘాతాలు తింటు అందరికి అన్నం తినిపిస్తుండు! కొనే వాడు సరుకులమ్మే కొట్టులో పెట్టిన ధరలకే సరుకులు కొంటున్నడు అన్నదాత అమ్మేవాడైనా కొనేవాని చెంతకు పోయి వాడు ఇచ్చిన ధరకే ధాన్యం అమ్ముకుంటున్నడు…

కన్నఊరి ప్రేమ

మట్టికుండలో మక్కగడ్క అండి ఇంత సల్ల పోసుకొని తింటే ఎంత మధురంగ.. ఉంటదో..మా పల్లె ప్రేమ అంత కమ్మగుంటది. మట్టితటారిలో జొన్నపిండిపోసి.. చేయిమీద రొట్టెకు రూపమిచ్చి..మా అవ్వ పెంకమిదేసి కాల్చిన జొన్నరొట్టె తిన్నట్లుంటది. మా ఊరి ప్రేమంటే బంధాలను కలిపేది. ఆప్యాయంగా పలకరిస్తూ ఆకలి కడుపులను నింపేది. చినుకులన్నీ నేలనుతడిపితే.. భూతల్లి కమ్మని వాసనని పంచినట్లుంటది…

అన్నదాత  ‘వరి’గోస

ఎవుసం చేయడమే ఏడేడు జన్మల పాపమైంది అన్నదాతగా మారడమే మహా శాపమై చుట్టుకుంది మెతుకు పండించడమే ఘోర నేరమై వెంబడిస్తుంది ఈ దేశంలో పుట్టడమే తప్పిదమై తరుముతుంది కాదంటే.. దేశానికి వెన్నెముకైన రైతన్నపై ఇంత చులకన భావన దేనికి ? జగతిని సుసంపన్నం చేసిటి సాగుబాటుకు నగుబాటేంటి ? ప్రకృతి విపత్తులు పెట్రేగినా చీడల పీడలు…

టిఆర్‌ఎస్‌పై సంగ్రామ నగారాకు సిద్ధమయిన బిజెపి

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’కు రాష్ట్ర బిజెపి గురువారం శ్రీకారం చుట్టింది . తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ళ కాలంలో ఇక్కడి ప్రజలు ఆశించిన దానికి భిన్నమైన పాలన జరుగుతున్న నేపథ్యంలో ఇక ఎంతమాత్రం ఈ ప్రభుత్వాన్ని కొనసాగించరాదన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర బిజెపి వర్గాలు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాయి. జోగులాంబ…

‌ప్రధానమంత్రి పంటల బీమా పథకం… పీఎంఎఫ్బీవై

ప్రతి నల్ల మబ్బుకూ ఓ జలతారు అంచు వ్యవసాయ ఆదాయాన్ని క్రమేణా స్ధిరీకరించడానికి, విపత్తుల వల్ల పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం నుంచి రైతును ఆదుకోవడంతోపాటు వారి రుణపరపతి మెరుగు కోసం ప్రభుత్వాలు పంటల బీమాను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పంటల బీమా పథకాలకు రుసుము ముందస్తు మంజూరుతోపాటు క్లెయిమ్‌ ‌హక్కును…

దిల్లీలో పోటా పోటీగా ఫ్లెక్సీల రాజకీయం

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌, ‌పక్కనే బీజేపీ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించిన టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో సీఎం కేసీఆర్‌ ‌దిల్లీలో దీక్షకు దిగిన సందర్బంగా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సీఎం దీక్షకు దిగిన తెలంగాణ భవన్‌లో కేంద్రం…

ఉత్తమ పార్లమెంటేరియన్‌ ‌జగ్జీవన్‌ ‌రామ్‌

‌నేడు బాబూ జగ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతి భారతదేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన నేత జగ్జీవన్‌ ‌రామ్‌. అతి చిన్న వయస్సులో (27 ఏళ్లకే) శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యి రికార్డు సృష్టించిన ప్రజానాయకుడు, స్వాతంత్య్ర సమర యోధుడు, బాబూ జగ్జీవన్‌ ‌రాం. పోలిటికల్‌ ‌కింగ్‌ ‌మేకర్‌గా రాజకీయంలో రాణించి, అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు…

దీనబాంధవ్‌..‌జగ్జీవన్‌ ‌రామ్‌

సుపరిపాలనా దక్షుడు సకలగుణ సంపన్నుడు సామాజిక విప్లవకారుడు స్వతంత్య్ర సమరవీరుడు అతడే.. పొలిటికల్‌ ‌కింగ్‌ ‌మేకర్‌ ‌బెస్ట్ ‌పార్లమెంటీరియన్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ అం‌తరాల వ్యవస్థ మీద ధిక్కార స్వరమెత్తిన ధీరుడు సాంఘీక దురాచారాల మీద యుద్ధం ప్రకటించిన యోధుడు స్వేచ్ఛా స్వాతంత్రం కోసం సమరమ్ము సాగించిన వీరుడు హరిత విప్లవోద్యమానికి అండగా నిలిచిన ఆతిరథుడు…

ఉగాది పండుగ విశిష్టత

ఉగస్య ఆది అనేదే ఉగాది. ‘‘ఉగ’’ అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన…