Tag telugu kavithalu

‌త్రిపుల్‌ ఐటి సమస్యలు తీర్చాలి

‘‘ఉల్టా చోర్‌ ‌కోత్వాల్‌ ‌కో డాంటే!’’ మన తెలంగాణ లో వాడుకలో వున్న ఒక మంచి సామెత ఇప్పుడు బాసర ఐటి లో నిజమై కనిపిస్తున్నది.ఎండా వానలకు ఎదురేగి ఉద్యమించిన వేలాది మంది విద్యార్థులు చేస్తున డిమాండ్లను పక్కన నెట్టి,కొత్తగా ఓ అధికారిని నియమించి చేతులు దులుపుకున్న ప్రభుత్వ చర్య తెలంగాణ సమాజానికి ‘‘సిల్లీ’’గా కనిపిస్తూంది.…

కాటికి చేరిన ప్రాయం!

వయసు ఉన్నప్పుడు ప్రణయం రాదు! ప్రణయం వచ్చే వరకు పరువం ఆగదు! హేమంతంతో సంగమం శిశిరంలో సాగితే! వసంతంతో సమాగమం ఉక్కపోతలో జోగితే! సోయలన్నీ జారిపోతూ సొబగులన్నీ జోలిపోతూ! వలపులకు, తలపులకు వియోగాలే మిగిలినవేళ! చెరుపులకు, మరుపులకు సంయోగాలే కలిగినవేళ! సింగారాలకు సిగపట్లు చాలక వయ్యారాలకు అగచాట్లు లేక! ఊహలు పుట్టని ఊసుల్లో కలలు రాని…

 ‌డోజర్ల దౌడులు

రాగద్వేషాల నాటకాలు.. భయ పక్షపాతాలకే.. పట్టం కట్టే కీచక పర్వాలు విభజించి పాలిస్తూ.. లక్షిత సమూహాలపై.. బుల్డోజర్లు దౌడుతీతలు ఉత్తర భారతాన కూల్చు వేతలు ! బుల్డోజర్‌ ఒక యంత్రమే కాదు.. భవనాల తలల్ని నరికే ఆయుధం విద్వేష విచ్ఛిన్న విధ్వంస చిహ్నం సామాన్యడి ఇంటిపై ఉక్కుపాదం నాగరికతను చూర్ణం చేసే డోజర్‌ ‌రాజ్యాంగ విలువలకు…

మెరుపు గింజలు

అక్కడ కొన్ని దేహాలు మాట్లాడతాయి కొమ్మలకు ఇప్పటికీ వేళాడబడి వుంటాయి అల్లంత దూరంలో గొంతులను పేర్చబడి చోద్యం చుస్తూ వున్న కొన్ని రాబందులు కుప్పల తెప్పల సంజాయిషీలు పడి వుంటాయి సైగలు చేసే చేతులు కాలే కడుపులు ఎండిన డొక్కలు దీనంగా చూస్తుంటాయి ఆ చూపుల తడిలో ఇప్పటికీ వెచ్చగా కొన్ని గింజలు మొలకెత్తుతుంటాయి చేసిన…

కోనసీమలో పంట విరామ పోరు

గత దశాబ్దాలుగా పుడమి తల్లినే నమ్ముకుని సాగు చేస్తున్న రైతుల వ్యధలు అన్నీ ఇన్నీ కావు.పది కాలాలపాటు నిలిచి పదిమంది ప్రాణాలను కాపాడే అన్నదాత రైతు. రైతుకు కష్టం వస్తే భరిస్తాడు తప్ప గొంతెత్తడు అనే నమ్మకం నాయక గణానికి వచ్చేసింది. ఎందుకంటే రైతులు సంఘటితం కాలేరు అనే నమ్మకం.నిజమే రైతులే సంఘటిత పోరాటాలు నడిపి…

మెప్పించి ఒప్పించాల్సిన చోట…

సామ దానంమాని కేవలం దండోపాయంతోనే ప్రజలను నిరోధిస్తామన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. ప్రజల సౌకర్యంకోసం, ప్రజల మద్దతుతో చేపడుతున్న పనులకు సంబంధించి , ఆ ప్రజలు నష్టపడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో జాప్యంచేస్తుండాన్ని ప్రశ్నించినందుకు వారిని చితక బాదడమన్నది నిజంగా బాధాకరం . తమ ప్రాంతంకోసం, తమ ఊరికోసం చేపడుతున్న ప్రాజెక్టుల్లో తమ…

సిఎం కేసీఆర్‌ ‌నమ్మదగ్గ మనిషి కాదు

పదవుల కోసం పెదాలు మూసే దద్దమ్మలు టిఆర్‌ఎస్‌ ‌నేతలు సిద్ధిపేటలో ప్రజా సంక్షేమ పాలన సదస్సులో ఈటల రాజేందర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14: ‌టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నమ్మదగ్గ మనిషి కాదనీ బిజెపి నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఉద్యమ కేసీఆర్‌కు ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందన్నారు.…

రాజకీయ ప్రయోజాల కోసమే ఇడి కేసులు

బీజేపీ విద్వేష భావజాలాన్ని తిప్పికొట్టాల్సిందే కుట్రలు బయటపడతాయనే భయంతోనే కేసులు నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికతో బండారం బయట పడుతుందన్న భయం కాంగ్రెస్‌కు ప్రజల ఆదరణ పెరగడంతో మోడీ ద్వయం కుట్రరాజకీయాలు ఇడి కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ‌ధర్నాలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌, ‌సిఎల్‌పి నేత భట్టిల విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రాజకీయ…

రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడితే సమాజం తిరగబడతది

బిజెపి నేతలు ఏం ముఖం పెట్టుకుని గజ్వేల్‌, ‌సిద్ధిపేటలో తిరుగుతున్నారు… కేంద్రం, బిజెపి నేతలపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుది గజ్వేల్‌ ఏఎం‌సి పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌న్యాయబద్దంగా కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్‌ ‌నిధులు విడుదల చేయకుండా…