Tag telugu kavithalu

హైదరాబాద్‌ ‌చేరుకున్న జెపి నడ్డా

విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు బిజెపి నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్ట్ ‌హెచ్‌ఐసిసిలో ఫోటో ఎగ్జిబిషన్‌ ‌ప్రారంభించిన నడ్డా హైదరాబాద్‌,‌జూలై1: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌, ‌లక్ష్మణ్‌,…

18 ఏళ్లలో ఎన్నో మార్పులతో వటవృక్షంగా కమలదళం

అప్పట్లో ఎన్‌డిలో మిత్రపక్షాలు కీలకం.. ఇప్పుడు మాత్రం వారు కేవలం నామమాత్రమే. ఎందుకంటే బిజెపికి తగినంత మెజార్టీ ఉంది. నాడు ఎన్డీయేలో ఉన్న శివసేన ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా లేదు. నాడు ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు టీడీపీ అధి కారంలో లేదు. అలాగే ఎన్డీఎలో భాగస్వామి కూడా…

హిందుత్వమా..? తెలంగాణ వాదమా…??

ఆం‌ధ్రప్రదేశ్‌ ‌విభజన ప్రక్రియను ‘తల్లిని చంపి బిడ్డను బతికించడం’గా కూడా ఆయన అదివరకు వ్యాఖ్యానించారు.పలు సందర్భాలలో,సభల్లో తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేయడం ద్వారా ఇక్కడి ప్రజల్నిమోడీ, అమిత్‌ ‌షా కించపరుస్తూ వస్తున్నారు.తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోడీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి గురువారం డిమాండ్‌ ‌చేశారు.రేవంత్‌…

రాజకీయ ఎత్తుగడే ..!

‘‘‌సహజంగా తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి సమావేశాలను ఆయాపార్టీలు ఏర్పాటు చేస్తాయి. కాని, తెలంగాణలోగాని, పక్కనున్న ఏపిలోగాని అంతగా మెజార్టీలేక పోయినా హైదారాబాద్‌లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడంలోనే ఆ పార్టీ ఎత్తుగడ ఏమిటన్నది అర్థమవుతున్నది. పైగా ఆ పార్టీ అగ్రనేతలంతా కట్టకట్టుకుని ఇక్కడి వొస్తున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ ‌సర్కార్‌ను టార్గెట్‌…

తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్‌ ‌సాక్షిగా వ్యతిరేకించి…

మోడీ ఏ మొహం పెట్టుకుని వొస్తున్నారు ప్రజలను అవమానించినందుకు ఏం సమాధానం ఇస్తారు దక్షిణాదిపై సవతితల్లి ప్రేమ చూపుతూ ఇక్కడ సమావేశాలా బిజెపి కార్యవర్గ సమావేశాలపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌బిజెపి కార్యవర్గ సమావేశాలతో మరోమారు దక్షిణాది రాష్ట్రాలను బోల్తాకొట్టించే కుట్రజరుగుతుందని పిసిపి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.…

నోవాటెల్‌ ‌హోటల్లోనే ప్రధాని మోడీ బస

ఎస్పీజీ సూచనలతో రాజ్‌భవన్‌కు బదులు నోవాటెల్‌కు మార్పు హెచ్‌ఐసిసి పరిసరాల్లో నేటి నుంచి జులై 3 వరకూ 144 సెక్షన్‌ ‌నో ఫ్లయింగ్‌ ‌జోన్‌గా ప్రకటించిన అధికారులు ప్రధాని రాకతో మూడు కమిషనరేట్ల పరిధిలో కఠిన ఆంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌మాదాపూర్‌ ‌నోవాటెల్‌ ‌హోటల్లో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ…

దిల్లీ, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం ట్రాఫిక్‌ ఇబ్బందులతో ప్రజలకు అవస్థలు న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దేశ రాజధాని దిల్లీ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే దిల్లీ మహానగరంలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆఫీసులకు వెళ్లే…

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

తెలంగాణకే ప్రత్యేకమైన పండుగలలో బోనాల పండుగ  కూడా ఒకటి. ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపు కుంటారు. జూలై లేదా ఆగస్టు  మాసంలో వచ్చే ఆషాడం వచ్చిందంటే, తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే దర్శన మిస్తాయి. గ్రామదేవతల…

అనిపిస్తుంటుంది…

అనిపిస్తూ వుంటుంది చుట్టూ మాట్లాడే ఈ మొహాలు జీవ దారాలను అల్లుకుంటూ వ్యక్తీకరిస్తుంటాయని అపరిపక్వ పొరల ప్రస్పుటీకరణను మెదడు మడతల్లో దేహం అలసత్వపు నీర్లక్ష్యం వేర్లు ఊడలమర్రిలా తలకిందులుగా గబ్బిలంలా వేలాడబడి శబ్దాల కనుమరుగులు జాడలు కొన్ని మధ్యాహ్నాలు ఆకాశంలో దూది పిందెల్లా మేఘాల వరస పరుచుకుని ఆలస్యంగా కదులుతాయి ఆదర్శాలు వ్యాఖ్యానాలు నదీప్రవాహాన్ని ఆపినట్లు…