Tag telugu kavithalu

ముందస్తుకు సై అంటున్న రాజకీయ పార్టీలు

ముందస్తు ఎన్నికలకు రాజకీయ పార్టీలుకూడా సిద్ధమంటున్నాయి.. నిన్నటివరకు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ వొచ్చిన ఈ పార్టీలు ఇప్పుడు తాము కూడా సిద్ధ్దమేనంటు ప్రకటనలు చేస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయను కున్నప్పుడు సహజంగా అధికార పార్టీ ముందుచూపుగా ముందస్తు ఎన్నికలకు సిద్ధ్దమవుతాయి. 2018లో టిఆర్‌ఎస్‌…

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్ల్లో భారీ వర్షాలు

గుజరాత్‌, ‌మహారాష్ట్రల్లో వర్ష బీభత్సం కేరళలో జోరువానలతో అతలాకుతలం న్యూ దిల్లీ, జూలై 12 : దేశవ్యాప్తంగా పలు రాష్టాల్ల్రో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉరకలేస్తున్నాయి. రోడ్లపై వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్‌ అం‌తరాయం ఏర్పడుతోంది. ఈదురుగాలులు, జడివానల దెబ్బకు భారీ చెట్లు,…

తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం

నేడు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. షెయర్‌ ‌జోన్‌, ‌ద్రోణి ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉందని,…

పోడు భూముల పోరు

‘వాళ్లు అడవి బిడ్డలు ఈ దేశ మూల వాసులు వనసంపదకు వారసులు అనాదిగా పోడుభూములు ఆసరాగా బతుకుతునోళ్ళు ఇపుడు… దోపిడీ మరిగిన రాజ్యం అటవి భూములపై కన్నేసి తేరగ కాజేయ పూనుకుంది పట్టాల హామీల పాతరేసి ఖాకీ మూకలను ఎగదోసి గిరిజన మహిళలు,తల్లుల్ని బట్టలు ఊడేటట్టు చితక్కొట్టి చీకటి కటకటాల్లోకి నెట్టేసింది పాలకుల పాశవికత్వానికి పూరి…

సింహాద్రి అప్పన్నకు సంప్రదాయ చందనోత్సవం… భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం

‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ ‌నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమా మ్యహమ్‌’’… ‘‘‌సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్‌’’… దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన సింహాచల క్షేత్రంలో స్వామి వారికి ఆషాఢ పౌర్ణమి నాడు చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ…

త్వరలో 800 కోట్లకు ప్రపంచ జనాభా..

“ప్రపంచ దేశాల జనాభాతో అంతర్జాతీయ వలసలు ముడిపడి ఉంటాయని, 2000-20 మధ్య కాలంలో సంపన్న దేశాలకు 80.5 మిలియన్ల ప్రజలు వలసలు వెళ్లారని, దీనితో ఆ దేశాల్లో మరణాల రేటు కన్న జననాల రేటు పెరగడం గమనించారు. గత కొన్ని ఏండ్లుగా అధిక ఆదాయ దేశాల్లో జనాభా పెరగడానికి ప్రధాన కారణంగా విదేశీ వలసలు నిలుస్తున్నాయి.…

నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పాఠశాలల ఖాతాల్లో నిల్వ ఉన్న నిధులను విద్యాశాఖ వెనక్కి తీసు కోవ డంతో ప్రధానో పాధ్యా యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వున్నారు. కొన్ని సంవత్స రాలుగా పాఠశాలల ఖాతాల్లో ఉన్న నిధులను గత విద్యా సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ ‌చివరిలో విద్యాశాఖ వాపసు తీసుకుంది. వీటిని వినియోగించుకునే అవకాశం…

యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : భారీ వర్షాలతో సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఓయూ పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న అంశాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. బీటెక్‌, ‌బీఫార్మాకు సంబంధించిన సెమిస్టర్‌…

ప్రజలకు అండగా డిజాస్టర్‌ ‌రిలీఫ్‌ ‌ఫోర్స్

వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలలో.. వరద పరిస్థితిపై అధికార యంత్రాంగాన్ని సిఎం కెసిఆర్‌ అ‌ప్రమత్తం చేశారు. సెక్రటేరియట్‌లో ప్రభుత్వం కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్‌ ‌ఫ్లడ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌మొబైల్‌ ‌నెంబర్లు : 79979 59705, 79979 50008. జిహెచ్‌ఎం‌సి కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నెంబరు : 040 21111111, 040 29555500. వరంగల్‌ ‌ఫ్లడ్‌…