Tag telugu kavithalu

అంతు లేని ఆవేదనలకు తుది రూపం ఆత్మహత్యలు

‘‘ ‌ప్రతీ జీవి కడవరకూ జీవించాలనే కోరుకుంటుంది. అర్ధవంతమైన జీవితాలను అర్థాంతరంగా ముగించాలని ఏ వ్యక్తి కోరుకోడు.బ్రతుకు బరువై,భద్రత కరువై, జీవించడానికి కడవరకూ పోరాటం చేసి,గత్యంతరం లేని పరిస్థితుల్లో తనువు చాలించాలని నిర్ణయించుకునే నిస్సహాయ వ్యక్తుల గురించి కూలంకుషంగా తెలుసు కోవాలి. వారి అంతరంగం లో చెలరేగిన అల్లకల్లోల పరిస్థితులను అర్థం చేసుకుని, అండగా నిలబడితే…

రాష్ట్ర రాజకీయాలకు ‘మునుగోడు’ ఎన్నిక దిక్సూచీ కానుందా?

మునుగోడు ఉప ఎన్నిక భవిష్యత్‌లో రాష్ట్ర రాజకీయాలను శాసించేదిగా కనిపిస్తున్నది. రాష్ట్ర రాజకీయాలిప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతున్నా, జాతీయ రాజకీయ పార్టీల దృష్టి అంతా ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఈ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్‌ ‌విడుదల కాకముందే ఇక్కడి రాజకీయాలు వేడందుకున్నాయి. ఎవరిని కదిలించినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా…

ఉ‌గ్రవాదులుగా మార్చేలా శిక్షణ ఇచ్చే సంస్థలకు నిధుల సమకూర్పు

పది రాష్ట్రాల్లో పిఎఫ్‌ఐ ‌కార్యాలయాల్లో సోదాలు దాదాపు వందమంది వ్యక్తుల అరెస్ట్ ‌కేంద్ర హోమ్‌ ‌శాఖ పర్యవైక్షణలో ఎన్‌ఐఎ ‌దాడులు దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ‌సోదాలు నిర్వహిస్తుంది. 10 రాష్టాల్ల్రో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కేసులో పాపులర్‌ ఆఫ్‌ ఇం‌డియా కార్యాలయాలపై ఎన్‌ఐఏ ‌సోదాలు నిర్వహించింది.…

జిస్‌కా లాఠీ ఉస్‌కీ బయింస్‌

దుడ్డు ఎవరిదో బర్రె వాడిదన్న నానుడిలా ఉంది ఏపి ప్రభుత్వ వైఖరి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆమోదంతో పని లేకుండా తమకు ఇష్టంవచ్చిన మార్పులు చేర్పులు చేసుకోవచ్చని ఏపి ప్రభుత్వం ఇప్పుడు చెప్పకనే చెప్పింది. ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడెవరైనా దివంగతులైతే వారి జ్ఞాపకార్థం కొత్త నిర్మాణాలకు, సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు లేదా రహదారులకు వారి పేర్లను…

‌ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ చర్యలతో సత్పలితాలు

జాతీయ ఆరోగ్య సూచికల్లో 3వ స్థానంలో తెలంగాణ 41 లక్షల మంది గర్భిణులకు రవాణా సదుపాయం ఆరోగ్యశ్రీ పరిధిలో 87.50 లక్షల కుటుంబాలు రూ.92 కోట్లతో హాస్పిటళ్లలో విద్యుత్‌ ‌సేఫ్టీ పనులు ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసం, నమ్మకం హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 22 : ‘‘ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు ధవాఖాన’’కు…

పిల్లల పండుగ… బొడ్డెమ్మ ప్రాధాన్యత

సృష్టిలో ప్రతీ జీవిది బ్రతుకు పోరాటమే, బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉండి, ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పే పండుగ బతుకమ్మ. ప్రత్యేకించి తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండగల కెల్లా పెద్ద పండుగ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికి తీసి వారి హృదయాన్ని ఆవిష్కరింప జేసే పండుగ. బతుకమ్మ పండుగ గురించి అందరికీ…

అసాధారణ ప్రయత్నం…

తెలుగు సాహిత్యంలో ప్రామాణికతను పొందుగుకుని విశేషాదరాభిమానాలను పొందింది శతకం. అనుభవైక సంవేదననూ, ఒక అభిరుచినీ, ఒక విమర్శాదృష్టిని  కలిగించడంలో శతకానికి ప్రాధాన్యత ఉంది. ముఖం వ్యాకరణం స్మృతమ్‌…. ‌వేదానికి వ్యాకరణం ముఖప్రాయమని వైయాకరణులు భావించారు. శతకానికి ఛందస్సు ప్రధానమైనప్పటికీ సరళమైన పదజాలంతో పండిత పామర ప్రీతిపాత్రంగా సాగిన శతకాలు తెలుగులో ఎన్నో లభిస్తాయి. మారిన కాలానికి…

ఓ ‌నీలి అంబరమా!

అంబరమా ఓ నీలి అంబరమా అవనికి నీవు అందమా అందకుండా వుంటేనే అందము! అందకుండా వుండేది గగనము! మిళ మిళ మెరిసే ఆ చుక్కలు రెక్కలు కట్టుక రమ్మంటాయి చిరునవ్వులు చిందే ఆ తారలు నీ ముంగిట్లో రంగవల్లులు! నీలి నీలి ఆ నింగి అవని వైపు వంగి అందినట్లే ఉంటుంది అంతలోనే ఎందుకో అందకుండా…

మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ది

మహిళలను విస్మరించే సమాజాన్ని ఊహించలేం మహిళాభివృద్ధితోపాటు భద్రతకు అధిక ప్రాధాన్యం మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌సునితా లక్ష్మారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌సునితా లక్ష్మారెడ్డి చెప్పారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి…