భావుక బాటసారి
అలసట లేని పవనంలా, ఉవ్వెత్తున లేచే కెరటంలా తుళ్ళి తుళ్ళి పడుతూ నెమలి నాట్యంలోని పరవశం, కోయిలగానంలోని తన్మయత్వం, దూకే జలపాతంలోని తోకముడవని తత్వాలు పొదువుకొని సాగేదే కవిత్వం. అదొక స్వేచ్ఛా విహంగం, భావోద్వేగం, రాగ ప్రవాహం, అనుభవం, అనుభూతుల సమాహారం. ప్రశ్నించే పదశరాలతో నిద్రాణమైన జనాన్ని జాగృతం చేస్తూ విలక్షణ రూపంతో పరుగులు తీసే…
