Tag Telangana politics

చరిత్ర: వర్తమాన వైఫల్యాలకు రక్షణకవచమా ..?

“చరిత్ర మన వర్తమాన, భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఉండాలి, అంతేకానీ చీకటిలో మనం తడబడిన ప్రతిసారీ నిందించే దెయ్యంలా ఉండకూడదు. స్వతంత్ర భారతదేశ  పోరాట యోధులు ఇప్పటికే వారి చరిత్రను రాసేశారు, అది మంచిదైనా చెడ్డదైనా వారి కలం సిరా ఎప్పుడో ఇంకిపోయింది. నేటి నాయకత్వం ఆ పాత పేజీలను చెరిపేయడం పైనే ఎందుకు అంతగా…

టి.కాంగ్రెస్‌లో చొరబడుతున్న తెలుగుదేశం!!

“బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలన్నదే చంద్రబాబు, రేవంత్‌ల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మిగిలున్న టీడీపీ వోటు బ్యాంకును ఐక్యం చేసి తనకు అనుకూలంగా మలచుకొని కాంగ్రెస్‌లో తన ఆధిపత్యానికి తిరుగులేకుండా చేసుకోవాలన్నది రేవంత్ వ్యూహంగా కనబడుతోంది. ఒకవేళ దీన్ని అమలు చేయడంలో రేవంత్ విజయం సాధిస్తే, కాంగ్రెస్‌లోని “సీనియర్ నాయక త్వానికి” ఇక భవిష్యత్తు లేనట్టే!…

ఆ మాటల అర్థం తెలంగాణ ద్రోహం, నిరంకుశత్వం!

“కొన్ని పదవులు అధిరోహించిన వ్యక్తులు కనీసం ఆ పదవికి ఉండే గౌరవాన్ని కాపాడడానికి, ఆ పదవికి ఉండవలసిన తటస్థ, ప్రజాస్వామిక స్థాయిని నిలపడానికి తమ నోటిని అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. తమ వాచాలత్వాన్ని సమయ సందర్భాలను బట్టి తగ్గించుకోవలసి ఉంటుంది. ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంలో అధినేతగా ఉండే వ్యక్తి తన లోలోపల ఎంత దౌర్జన్య, నిరంకుశ…

 లెక్కలు తేలేనా ..?

 “ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను కార్నర్‌ చేయలని చూసి.. ఒక రకంగా సక్సెస్‌ కూడా అయ్యింది కాంగ్రెస్‌ పార్టీ..! కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు.. మేడిగడ్డ కుంగిపోవడం కూడా కేసీఆర్‌ వైఫల్యమే అని ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది..! అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ పేరుతో కేసీఆర్‌ను కూడా విచారించింది..! ఇప్పుడు.. దానికి కౌంటర్‌ అన్నట్లు…

కెసిఆర్‌ ‌యాక్షన్‌.. ‌కాంగ్రెస్‌ ‌రియాక్షన్‌

 “రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తమకున్నదంటూ, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకపోవడం ఒకటైతే, ఏ నీటి కోసమైతే ఉద్యమించి తెలంగాణ…

రేవంత్ బాబు మధ్య సాన్నిహిత్యమే మరింత చిచ్చు రేపుతోందా?

“ఇప్పుడు తాజాగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రంగంలోనికి దిగి ద్విముఖ పోరు బాట ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు బీజేపీ పార్టీని టార్గెట్ చేశారు. రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా గోదావరి నదీ జలాలను కొల్ల గొడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు మరొక కొత్త…

తెలంగాణ అంటే వ్యాపారం కాదు

“ఆకలి,అసమానతలను అంతం చేసి ,ఆరోగ్యం,విద్య అందరికీ పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల తో పౌరులందరికీ మంచి,సుస్థిరమైన భవిష్యత్తు అందించడం తోనే విజన్ – 2047 లో పొందుపరిచిన రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి సాధ్యం అని గుర్తించాలి. అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియల్లో ప్రజాప్రతినిధుల, పౌరుల భాగస్వామ్యం మరియు అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవడం అత్యవసరం. ప్రణాళిక కర్తలు,…

జూబ్లీలో కాంగ్రెస్‌ ‌విజయం… బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలం

“ప్రధానంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్‌ ‌ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఇం‌కా అధికారంలో మూడేళ్ళపాటు…

తిరుగులేని నాయ‌కుడిగా రేవంత్‌రెడ్డి!

“రెండేళ్ల పాల‌న ముగియ‌గానే అస‌మ్మ‌తి రాగాలు మొద‌లు కావ‌డం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే ప‌రిస్థితి సీనియ‌ర్ల‌నుంచి ఎదురైంది. ఈ అస‌మ్మ‌తిని క‌ట్ట‌డి చేయ‌డం, పార్టీ అధిష్టానానికి కూడా త‌న విలువ‌ను తెలియ‌జెప్ప‌డానికి జూబ్లీ ఎన్నిక‌ను ఆయ‌న ఒక అస్త్రంగా ఉప‌యోగించుకున్నార‌నే చెప్పాలి. ఈ గెలుపుతో మ‌రో మూడేళ్ల‌పాటు త‌న ఆధిప‌త్యానికి ఎటువంటి…