Tag shobha

విజేత నేనే

నా తప్పుకు నిజమనే సర్టిఫికెట్ ఇచ్చే పెద్ద మనసు ఏ రోజుకు ఉంటుందో అప్పుడు నేను అబద్దం కాదనీ నమ్మే రాత్రి నాకు బానిస అందాక నా తప్పు పక్షాన చేసే యుద్ధంలో అనుభవమే సాయుధబలంగా శత్రువు కనుచూపు మేరలో కనిపించదు అప్పుడు పట్టే నిద్రలో నా కలపై ఎవరి సంతకం ఉంటుందో అది ఓ…

భర్తలూ భార్యలూ!

మెరుపు తీగెలు -బమ్మిడి జగదీశ్వరరావు ఎవరైనా అన్నం తినేటప్పుడు కూరలు నంచుకుంటారు, యీ పిల్లలు మాత్రం కథలు నంచుకుంటారు. ఊకొడుతూ వదలకుండా తినేస్తారు. రోజూ మా అత్తయ్య మనవల్ని కూర్చోపెట్టుకొని బానే కథలు చెపుతుంది. ‘రాజుగారికి యిద్దరు భార్యలు. ఒక భార్యకి వొక వెంట్రుకా- రెండో భార్యకు రెండు వెంట్రుకలు…’ కథవిని పిల్లలు నవ్వుతూ ఆలోచనల్లో…

బాధకు అర్థం చెప్పే ‘అనిమేష’

చెమ్మ:   – వారాల ఆనంద్ నందిని సిధారెడ్డి తెలంగాణ నేలలో పుటిన కవి. అదే నేల శ్వాసను అక్షరాల్లో నింపిన కవి కూడా. ఆయన కవిత్వం ఆ  ప్రాంతపు చరిత్ర, అక్కడి ప్రజల సంఘర్షణకు ప్రతిధ్వనీ ప్రతిబింబం. పల్లె జీవితం, రైతు బాట, దుమ్ము, దూళి చెరువు, బీడు ఇవన్నీ ఆయన పొందిన బాల్యానుభవాలే కాదు, ఆ తర్వాతి కాలంలో ఆయన కవిత్వానికి మూలాధారాలు కూడా అయ్యాయి. యువకుడిగా ఉన్నప్పుడే కవిత్వం వైపు ఆకర్షితుడయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన కవిత్వం కేవలం పుస్తకాల నుంచి…

బాధితులే ఉద్యమాలు నిర్మిస్తారు

ఉద్యమాలు అధికారానికి అణచివేతకు వ్యతిరేకంగా వస్తాయి. ఉన్న స్థితి ఊపిరాడనీయనదిగా, అవమానకరంగా ఉన్నప్పుడు దానిని స్వేచ్ఛా వాయువులతో నింపటానికి, ఆత్మగౌరవంతో జీవించటానికి  బాధితులే సంఘటితమై ఉద్యమాలను నిర్మిస్తారు. ఉద్యమాలు భాషాసాహిత్య ఆధిపత్యాలకు వ్యతిరేకంగా కూడా వస్తాయని దక్షిణాదిరాష్ట్రాల వందేళ్ల పైబడ్డ చరిత్ర చెబుతుంది. భాష ఒక సమూహానికి సంబంధించిన అస్తిత్వం. అలాంటి అస్తిత్వం మీద మరొకభాష ఆధిపత్యం భిన్నత్వాల సమాఖ్య సంస్కృతికి…

దాక్షిణాత్య ఉద్యమం అనివార్యం

మధ్య , దక్షిణ ద్రావిడ భాషాకుటుంబానికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషలు స్థూలంగా మాట్లాడే నైసర్గికప్రాంతమంతా అనేక మౌలిక సంక్షోభాలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి. భారత రాజ్యాంగంలోని ఫెడరల్ కూర్పును పూర్తిగా మాయం చేస్తూ ‘కేంద్రస్వామ్యం’ ఏర్పాటు యత్నాలతో ద్రావిడ రాష్ట్రాల రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం అవుతోంది. దక్షిణాది కుత్తుకపై వేలాడుతున్న నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ మరో ప్రమాదం. దేశ సమైక్యత పేరిట…

పునరుజ్జీవన దశ

ద్రావిడ సాహిత్యోద్యమం ప్రస్తుతం పునరుజ్జీవన దశలో ఉందనుకొంటున్నాను. ఇది సాంప్రదాయక ద్రావిడసాహిత్యం, తత్వం, సంస్కృతిపట్ల, యువతలో కొత్త ఆసక్తిని కలిగిస్తోంది. ద్రావిడతత్వం, సంఘ సంస్కరణలు, భాషా ఉద్యమాల చరిత్ర గురించి చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. నూతన ద్రావిడ సాహిత్య చైతన్యం స్పష్టంగా మొలకెత్తుతోంది. అయినప్పటికీ, ఇది స్థిరమైన, సృజనాత్మకమైన మరియు ప్రభావవంతమైన సాహిత్యోద్యమంగా రూపుదిద్దుకునే ప్రక్రియ ఇంకా జరగవలసి ఉంది. యువ రచయితలు, బౌద్ధికులు ఈ చైతన్యాన్ని…

గూండ్ల వెంకట నారాయణ

ద్రావిడ సాహిత్యోద్యమం రావటానికి సూచనలు కనిస్తున్నాయి. ఆత్మగౌరవ పోరాటంగా మొదలయిన ద్రావిడ ఉద్యమం భాషా, సామాజిక, రాజకీయాల్లో తన ప్రభావం బలంగా చూపించింది. కానీ సాహిత్యంలో ఉద్యమంగా ప్రభావం చూపలేదు. భావజాలంగా మాత్రమే చూపిస్తూ వచ్చింది. అయితే ఈ ప్రభావం తెలుగువారికి మరీ తక్కువ. తెలుగునాట ద్రావిడవాదం గురించి ఎక్కువ చర్చలు జరగలేదు. ఇందుకు మరోకారణం ద్రావిడ అనగానే…

దాక్షిణాత్య ఉద్యమం

రావలసి ఉన్నది. రావడానికి కావలసిన భౌతిక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వస్తే బాగుంటుంది. కానీ, వచ్చితీరుతుందని చెప్పలేము. ద్రావిడ సాహిత్యోద్యమం అనగానే, గతంలో ఉమ్మడి మద్రాసురాష్ట్రంలో తమిళుల నాయకత్వంలో జరిగిన ద్రావిడ రాజకీయ, సామాజిక ఉద్యమం మనకు స్ఫురిస్తుంది.  తెలుగు, కన్నడ, మలయాళ ప్రాంతాలలో దాని ప్రభావం పరిమితంగానే ఉండింది. దక్షిణాది ప్రాంతాల వారి మధ్య సోదరత్వ సారూప్యాలు ఉండవచ్చును…

ఆ అవసరం లేదనే!

ద్రావిడసాహిత్యోద్యమం రాబోతోందా, లేక రావాలని కోరుకుంటున్నారా? రావాలని కోరుకుంటూ ఉంటే మాత్రం, నా సమాధానం- ఆ అవసరం లేదనే! జరుగుతున్నది సాహిత్యాల మధ్య ఘర్షణ కాదు. అంతకన్నా కీలకంగా మతమనే ఒక భావోద్వేగపరమైన అంశాన్ని ఉపయోగించుకుంటూ ద్రావిడ భాషాప్రాంతాలను ఉత్తర, పశ్చిమభారతీయ రాజకీయ ఆధిపత్యంలోకి లాక్కునే ప్రయత్నం. ఆ విధంగా ద్రావిడ భాషాప్రాంతాల ప్రత్యేక అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. కనుక…