Tag Literary Review

పరాయి!- బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు కొత్త పెళ్ళికూతురులా కళకళలాడుతూ వుంది కొత్త యిల్లు! కన్నులు పట్టనట్టుగా యింటిని చూస్తున్నాడు అతడు. అతని ముఖంలో తృప్తి కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. ఇల్లంతా కలియదిరిగాడు. చలువరాతి గచ్చుమీద పడి పొర్లాడు. బోర్లా పడ్డాడు. వెల్లకిలా పడ్డాడు. తల్లి గుండెలమీద పసి పిల్లాడిలా ఆదమరిచి నిద్రపోయాడు. అంతలోనే వులిక్కిపడి ఫ్లోర్ మీంచి లేచాడు. ఏదో…