రోహిత్ వేముల బిల్లు… ఒక సామాజిక ముందడుగు!

ఉన్నత విద్యాసంస్థలు జ్ఞానాన్ని పంచే దేవాలయాలు మాత్రమే కాదు, సమానత్వాన్ని, ప్రజాస్వామ్య విలువలను నేర్పే సామాజిక ప్రయోగశాలలు కూడా కావాలి. కానీ, దురదృష్టవశాత్తూ నేటికీ దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు కుల వివక్షకు, వ్యవస్థాగత అణచివేతకు కేంద్రాలుగా మారుతుండటం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు ఆధారిత వివక్షను శాశ్వతంగా నిర్మూలించేందుకు…
