హన్న!

మెరుపు తీగెలు బుజ్జిగాడు నిద్రలేచాడు. లేచాడు అంటే లేవలేదు. బెడ్‌మీద పడుకొనే వున్నాడు. కళ్ళు తెరిచి వున్నాయి. ఎదురుగా అమ్మ ముఖం, నవ్వుతూ. బుజ్జిగాడు నవ్వలేదు. ఆవలింత తియ్యలేదు. బద్దకంగా అటూయిటూ దొర్లలేదు. విప్పారిన కళ్ళతో చూశాడు. చూస్తూనేవున్నాడు. ‘ఏమిటమ్మా తల్లీ’ అని గోముగా నుదురుకు నుదురు ఆనించి ముక్కుకు ముక్కు రాస్తూ ముద్దు చేసింది…

