– కిట్స్‌డబ్ల్యూ ప్రిన్సిపాల్ అశోకరెడ్డి
– కిట్స్‌లో రెండు రోజుల టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 23: వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్‌డబ్ల్యూ) ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్-2025 శనివారం ప్రారంభమైంది. పోటీలను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ ఆడాలంటే సాంకేతిక, దృశ్య నైపుణ్యాలు మెండుగా ఉండాలన్నారు. ప్రజలలో శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఆటలు, క్రీడలు ముఖ్యమైన సాధనాలని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వరంగల్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యుడీటీిటీఏ) అధ్యక్షుడు అకారపు హరీష్ మాట్లాడుతూ ఈ పోటీలు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. ఈ టోర్నమెంట్‌లో అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17, అండర్ 19 బాలబాలికలకు, పురుషుల, మహిళలకు రెండు రోజులలో ఆరు విభాగాలకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రెండు రోజుల్లో 50 జట్లతో 150 మంది క్రీడాకారులకు సింగిల్స్, డబుల్స్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. గౌరవ అతిథి కిట్స్‌డబ్ల్యు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పింగిళి రమేష్ రెడ్డి, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ఎం.మోహన్ రావు, డబ్ల్యుడీటీటీఏ ప్రధాన కార్యదర్శి అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, డబ్ల్యుడీటీటీఏ వైస్ ప్రెసిడెంట్లు డాక్టర్ జైసింగ్ అజ్మీరా, కె.సునీల్ కుమార్, కార్యనిర్వాహక సభ్యులు రవికుమార్, కె.వెంకటస్వామి, మహేష్, అన్ని విభాగాల అధిపతులు, అన్ని విభాగాల డీన్లు, అధ్యాపకులు, సిబ్బంది, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి పాల్గొన్నారు.





