– టీ-శాట్ సీఈవోను కలిసిన చైల్డ్ రైట్స్ కమిషన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: విద్య, శిక్షణ (విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి ఇతర అంశాలపై కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న టీ-శాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని మార్యాదపూర్వకంగా కలిసిన చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి, సభ్యలు. టి-శాట్ ద్వారా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వరంలో పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చైర్‌పర్సన్ తెలిపారు. అలాగే పిల్లల కోసం కూడా ప్రత్యేకమైన కార్యమాలు భవిష్యత్తులో కమిషన్ నుండి టి-శాట్ ద్వారా చేయనున్నామన్నారు. డిజిటల్ మాధ్యమాల ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉన్నందున పిల్లలకు, వారితోపాటు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయనున్నట్లు ఆమె తెలిపారు. పిల్లల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల గురించి, అలాగే కమ్యూనిటీ క్యాంపైన్ ప్రతి నెలా టి-శాట్ ద్వారా బాలల హక్కులు, వారి రక్షణ కోసం , బాలలపై జరుగుతున్న అఘాయిత్యాలు, సామజిక దురాచారాలు, జేజే యాక్ట్, ఇతర చట్టాల అవగాహన కల్పించేందుకు కమిషన్ టీ-శాట్ ద్వారా పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు చేరువయ్యే విధంగా కార్యక్రమాలు చేయనున్నట్లు సీతాదయాకర్ వివరించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు వచన్ కుమార్, వందన గౌడ్, చందన, అపర్ణ, సరిత, ప్రేమలతా అగర్వాల్. టి-శాట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





