మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’

– ఆటోమేటెడ్ ట్రాకింగ్ ఫీచర్
– ప్రయాణం మొదలైన దగ్గరి నుంచే ట్రాకింగ్
– మహిళలనుంచి 4.7 రేటింగ్
– డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: రా ష్ట్రంలో మహిళల భద్రతకు, ముఖ్యంగా శ్రామిక మహిళల సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించిన ‘టీ-సేఫ్’ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవాత్మక ముందడుగు అని తెలంగాణా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి పేర్కొ న్నారు. చత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఇటీవల జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్ లో ‘టీ-సేఫ్ మ హిళల కోసం సురక్షిత ప్రయాణం’ అనే అం శంపై ప్రజెంటేషన్ ఇచ్చి, ఈ సాంకేతిక పరి జ్ఞానం యొక్క విశిష్టతను వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2022 ప్రకారం, భారతదేశంలో అత్యధికంగా శ్రామిక మహిళల శాతం తెలంగాణలోనే ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో మహిళల ప్రయాణాన్ని అత్యంత సుర క్షితం చేయాలనే లక్ష్యంతో 2024లో ‘టీ-సేఫ్’ యాప్ను ప్రారంభించినట్లు డిజిపి వెల్లడించారు. ఇప్పటివరకు మహిళా భద్రత కోసం ఉన్న కోసం మాత్రమే పనిచేస్తుండగా, ‘టీ-సేఫ్’ మా త్రం ప్రయాణం మొదలైనప్పటి నుంచే పర్యవేక్షణ ప్రారంభిస్తుంది. ఈ విధంగా, ఇది కేవలం ‘ప్రతిస్పందించే విధానానికి బదులుగా, ‘ముంద సౌకర్యాలు కేవలం అత్యవసర ప్రతిస్పందన ‘స్తు నివారణ’ విధానంలో పనిచేయడం దీని ప్రధాన ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నా రు. ‘ట్రావెల్-సేఫ్’ లేదా ‘టీ-సేఫ్’ ముఖ్య లక్షణాలలో ఒకటి దీనికి స్మార్ట్ ఫోన్ అవసరం లేకపోవడం. ఇందులో ఆటోమేటెడ్
రైడ్ ట్రాకింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది రూట్ డివియేషన్స్ చేరుకోవాల్సిన అంచ నా సమయం ఆలస్యం, వెరిఫికేషన్ కాల్కు సమాధానం ఇవ్వకపోవడం, ప్రయాణం ఎక్కు వ సమయం తీసుకోవడం, తప్పు పాస్కోడ్ను నొక్కడం వంటి 42 రకాల డివియేషన్స్ గుర్తిం చగలదు. ఈ ఫీచర్ మొదలైనప్పుడు సమీ పంలోని వ్యాన్లు లేదా పోలీస్ పెట్రోల్ మోటా రైసైకిళ్లు తక్షణమే బాధితురాలి ప్రదేశానికి చేరు కుంటాయని ఆయన తెలిపారు. ఈ సదుపా యానికి మహిళల నుంచి 5 కు గాను 4.7 రేటింగ్ లభించిందని, ఈ విషయంలో ఇప్పటి కే 350కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వ హించామని డిజిపి తెలియజేశారు. భవిష్య త్తులో రాష్ట్రంలోని ఉబెర్, ఓలా, రాపిడో మేరు, అభిబస్, వంటి అన్ని క్యాబ్ అగ్రిగేటర్ లతో టీ-సేఫ్ను సమగ్రపరచాలని ప్రతిపాదిం చారు. అంతేకాక కృత్రిమ మేధ ఉపయోగించి మహిళా భద్రతకు బలహీన ప్రాంతాలను గుర్తించిన తర్వాత ఆటోమేటెడ్ సేఫ్టీ చెక్ కాల్సు ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఏదైనా ప్రమాదాన్ని గుర్తించడానికి, మహిళకు ప్రమాదం ఉన్నట్లు సంకేతాలను అందించే వాయిస్ రికగ్నిషన్ను కూడా ఏఐ ద్వారా అమలు చేయాలని ప్రతిపాదించారు. ప్రమాదాలను గుర్తించడానికి ఎప్పటికప్పుడు డ్రోన్, సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ విశ్లేషణ చేయబడుతుందని వివరించారు. డీజీపీ తన ప్రజెంటేషన్లో విజన్ 2047 నాటికి పోలీసు విభాగంలో మహిళల నిష్పత్తిని 50% వరకు పెంచాలని, పోలీస్ శాఖలో పనిచేసే మహిళలకు అనుగుణంగా తయారు చేయాలని ప్రతిపాదించారు. సామాజిక అవగాహన కోసం, ఎస్ ఎస్ సి ఈ ఆర్టీతో కలిసి తెలంగాణ పోలీసులు క్లాస్ 1 నుండి క్లాస్ 10 వరకు సిలబస్లో మార్పులు చేసి, లింగ-తటస్థ కథనాలను చేర్చినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్, ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్’ను ఏడు జిల్లాల్లో ప్రారంభించింది. పని ప్రదేశంలో లైంగిక వేధిం పుల నివారణకు సంబంధించిన పోలీసుల మొ దటి ఉమ్మడి చొరవగా ‘సాహస్ ‘ కార్యక్రమం ద్వారా కార్పొరేట్ సంస్థలలో అంతర్గత ఫిర్యా దు ల కమిటీల ఏర్పాటుకు శిక్షణ ఇస్తున్నట్లు డీజీపీ వివరించారు. గ్రామ స్థాయిలో డిజిటల్ అక్షరాస్యత పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతా లను మహిళలకు సురక్షితంగా మార్చడం, షి బి.శివధర్ టీమ్ల ద్వారా అవగాహన కల్పించడం నేరస్తులకు కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యత సాంకేతికత వినియోగంపై ఉన్న సంకల్పం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.. ఈ రకమైన అప్ లను రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రారం భిస్తే బాగుంటుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *