– గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 19 :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని భక్తులు వేకువ జామునే గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శతకటాభిషేకం పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో 108 కళాశాలకు పూజలు జరిపారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠ అలంకారమూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్రనామార్చన జరిపారు. స్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పాత గుట్ట ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు అధిక పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





