ముగిసిన సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమ యాత్ర

– గాంధీ మెడికల్‌ కళాశాలకు పార్థివ దేహం అప్పగింత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. మగ్దుమ్‌ భవన్‌ నుండి సుధాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్‌ కాలేజీ వరకు ఊరేగింపు నిర్వహించగా కుటుంబ సభ్యులు ఆయన పార్థివ దేహాన్ని కళాశాలకు అప్పగించారు. మగ్దుం భవన్‌ వద్ద పోలీసులు గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరపడంతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. సీపీఐ కార్యకర్తలు, నాయకులు కామ్రేడ్‌ సురవరం సుధాకర్‌రెడ్డి అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. అంతిమ యాత్రలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురవరం సుధాకర్‌ రెడ్డి శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని కేర్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం విదితమే.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *