సుప్రీం కోర్టు జడ్జిలుగా జస్టిస్‌ అరాధే, జస్టిస్‌ ‌పంచోలీలు

– ప్రమాణం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌బి.ఆర్‌.‌గవాయ్‌

‌న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్29: ‌జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ‌విపుల్‌ ఎం.‌పంచోలీలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్‌.‌గవాయ్‌  ‌శుక్రవారం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు కొత్త జడ్జీల నియామకంతో కోర్టులో పూర్తి స్థాయి జడ్జీల సంఖ్య తిరిగి 34కి చేరుకుంది. 2025 నవంబర్‌ 23‌న సిజెఐ బి.ఆర్‌.‌గవాయ్‌ ‌పదవీవిరమణ చేసే వరకు సుప్రీంకోర్టు ఫుల్‌ ‌బెంచ్‌ ‌విధులు నిర్వహించనుంది. అయితే జస్టిస్‌ ‌పంచోలీని సుప్రీంకోర్టుకు ఎంపిక చేస్తూ కొలిజీయం తీసుకున్న నిర్ణయంపై ఆసభ్యుల్లో ఒకరైన జస్టిస్‌ ‌బి.వి.నాగరత్న భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. భారత హైకోర్టు జడ్జీల సీనియారిటీ జాబితాలో జస్టిస్‌ ‌పంచోలి 57వ స్థానంలో ఉన్నారని, ఆయనకంటే సీనియర్లుగా ఉన్న పలువురు ప్రతిభావంతులైన జడ్జీలు ఉన్నారని జస్టిస్‌ ‌నాగరత్న పేర్కొన్నారు. జస్టిస్‌ ‌పంచోలికి పదోన్నతి కల్పించాలన్న నిర్ణయం జ్యుడీషియల్‌ ‌నిర్వహణకు ప్రతికూలంగా ఉందని, ఇది సుప్రీంకోర్టు కొలీజియం విశ్వసనీయతను ప్రమాదంలో పడేస్తుందని అన్నారు. 4:1 మెజారిటీతో కొలీజియం ఆగస్ట్ 25‌న జస్టిస్‌ అరాధేతో పాటు జస్టిస్‌ ‌పంచోలిని సిఫారసు చేసింది. సుప్రీంకోర్టుకు వారి నియామకాన్ని 48 గంటల్లోనే, ఆగస్ట్ 27‌న ప్రకటించారు. జస్టిస్‌ ‌పంచోలీ 1968, మే 28న అహ్మదాబాద్‌లో జన్మించారు. 2016 జూన్‌లో గుజరాత్‌ ‌హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 జులైలో ఆయన పాట్నా హైకోర్టుకు బదిలీ కాగా 2025 జులై 21న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ అరాధే 1964లో జన్మించారు. 2009 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌ అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 ఫిబ్రవరిలో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో జమ్మూకాశ్మీర్‌ ‌హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2018లో మే నుండి ఆగస్ట్ ‌వరకు మూడు నెలల పాటు దాని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్‌ అరాధే కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2022 అక్టోబర్‌ ‌వరకు దాని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 జులైలో తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు అనంతరం 2025 జనవరి 21న బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాబితాలో జస్టిస్‌ అరాధే మూడవ స్థానంలో ఉన్నారు. జస్టిస్‌ ‌పంచోలి 19వ స్థానంలో ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *