సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా

– గట్టు వామన్‌రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి
– సీబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: అడ్వొకేట్‌ గట్టు వామన్‌ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వాగతించారు. ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో అసలు దోషులు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. మంథనిలో నడి రోడ్డుపై అడ్వకేట్‌ వామన్‌రావు దంపతులు హత్యకు గురైతే అప్పటీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. నిష్పక్షపాతంగా విచారణ చేయకుండా దోషులను కాపాడిరదన్నారు. కుమారుడు, కోడలిని కోల్పోయిన ఆ వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం చేయాల్సిన అప్పటి ప్రభుత్వ పెద్దలు విచారణను తప్పుదోవ పట్టించి హంతకులను కాపాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌ పార్టీ కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీధర్‌బాబు అన్నారు. చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *