కోర్టు ఏం మ్యాజిక్ చేయగలదు ?

– దిల్లీ పొల్యూషన్పై సుప్రీంకోర్టు

దిల్లీ, నవంబర్ 27 : ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు దిగజారిపోతున్నది. ఈ క్రమంలో ఢిల్లీలో కాలుష్య కట్టడి కోరుతూ దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు డిసెంబర్ 3న విచారించనున్నట్లు తెలిపింది. ఈ కాలుష్య సమస్యను నిరంతరం పర్యవేక్షిం చాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయామాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ‘కాలుష్యం విషయంలో కోర్టు ఏం మ్యాజిక్ చేయగ ల దు..’ అని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్ర శ్నించింది. ‘ఒక న్యాయస్థానం ఏం మా యా జాలం చేయగలదు? ఢిల్లీ-ఎన్సీఆర్ కు ఇది ప్రమాదకరమని తెలుసు. అయితే పరిష్కారం ఏమిటనేది ఇక్కడ ముఖ్యం. దీనికి గల కార ణాలను గుర్తించాలి. పరిష్కారాలు కేవలం ఆ రంగంలోని నిపుణుల నుంచే లభి స్తాయి. దీర్ఘకాలిక పరిష్కారాలు లభిస్తాయని మేం ఆశిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *