సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట

– పరువు నష్టం దావా కేసు విచారణకు నిరాకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రేవంత్‌పై టీ-బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్‌ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌-125 కింద కేసు కొనసాగుతుందని కోర్టు తెలిపింది. దీంతో రేవంత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ ట్రయల్‌ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పును బీజేపీ సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సోమవారం విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. అంతేకాదు కోర్టును రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని పిటిషనర్‌ అయిన బీజేపీ నేతపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాజకీయ నేతలు సున్నితత్వంతో ఉంటే బావుండేదని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *