– ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూదిల్లీ, ఆగస్ట్ 25: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్‌రావును ఆదేశించింది. ప్రభాకర్ రావు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సాక్ష్యాధారాలు టాంపరింగ్ చేశారని సిద్ధార్థ లూథ్రా అన్నారు. డేటా రికవరీ చేయడానికి కూడా సహకరించడం లేదని చెప్పారు. తాను స్వయంగా వచ్చి కేసు వివరాలు అన్నీ చెప్తానని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు పాస్ ఓవర్ ఇవ్వాలని కోరారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని ఫార్మాట్ చేసి ఇచ్చారని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌ట్యాప్ కూడా అదే స్థితిలో ఉందని, దానిలో కూడా ఎలాంటి డేటా లేకుండా చేశారని తుషార్ మెహతా అన్నారు. ప్రభాకర్‌రావు దర్యాప్తునకు సహకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఎన్నిసార్లు పిలిచినా దర్యాప్తునకు హాజరవుతున్నట్లు ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది శేషాద్రి నాయుడు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌టాప్ కూడా అదే స్థితిలో ఉందని, దానిలో ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.


