– కొత్త సర్పంచ్‌లను కలుపుకుని సమస్యలు పరిష్కరిస్తా
– కాంగ్రెస్ సర్పంచ్‌లను గెలిపిస్తే మరింత అభివృద్ధి
– కొత్త సర్పంచ్‌లను సన్మానించిన మంత్రి పొన్నం
హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: గ్రామాల అభివృద్ధికి కొత్త సర్పంచ్‌లు ప్రజలతో మమేకమై ఐక్యంగా పని చేయాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటానని, గ్రామాల సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఆయన శుక్రవారం అభినందించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న విధంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కొత్త సర్పంచ్‌లకు ఉద్బోధించారు. ప్రజల సమస్యలను ఉన్నతాధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఇంకా ఎవరికైనా అందకపోతే అర్హులకు ఉచిత విద్యుత్ ఇచ్చేలా చూడాలన్నారు. నూతన రేషన్ కార్డులు ఇవ్వడం, కొత్తగా పేర్లు చేర్చడంలొ నూతన సర్పంచ్‌లు చొరవ తీసుకోవాలన్నారు. కాన్సర్ రాకుండా ప్లాస్టిక్ నిషేధిస్తూ హోటల్స్, ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామని చెప్పారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అభివృద్ధికి సంబంధించిన జిల్లా అధికారులను పిలిచి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని, కోడ్ అయిపోగానే మీ గ్రామాల అభివృద్ధికి సంబంధించి తన దగ్గర ఉన్న నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. భీమదేవరపల్లిలో 15 స్థానాలను, ఎల్కతుర్తిలో 11 గ్రామ పంచాయతీ లను కాంగ్రెస్ గెలుచుకుందంటూ మిగిలినచోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ అక్కాచెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని, మహిళలను బస్సులకు యజమానులు చేశామని, సన్న వడ్లకు బోనస్, రైతు భరోసా, రైతు రుణ మాఫీ చేశామని వివరించారు. హుస్నాబాద్ అంటే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మీ గౌరవం పెరిగేలా చేస్తా అని చెప్పా.. ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాని పొన్నం చెప్పారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, కరీంనగర్, జనగామ అక్కన్నపేట నాలుగు లేన్ల రోడ్డు, 250 పడకల హాస్పిటల్, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి వ ుహా సముద్రం గండి, సర్వాయి పాపన్న కోట అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నా తరపున మీకు లేఖలు పంపించానని, అభివృద్ధికి సహకరించాలని కోరానన్నారు. అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంతానికి నీళ్ళు అందిస్తామని, ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తానని, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కలుపుకుని గ్రామాల అభివృద్ధికి పని చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న 173మంది సర్పంచ్‌లకు పంచాయుతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి ప్లాన్ ఆఫ్ యాక్షన్‌పై శిక్షణ ఉంటుందని తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని జిల్లా మంత్రులం ముఖ్యమంత్రిని కలిసి కోరుతామని, దానికి సంబంధించిన నివేదిక తయారు చేయాలని మంత్రి పొన్నం వైస్ చాన్స్‌లర్‌ను కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



