జర్నలిస్ట్‌ దత్తురెడ్డి కుటుంబానికి అండ

ఆర్‌అండ్‌బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి

పిట్లం (కామారెడ్డి), ప్రజాతంత్ర, జులై 7: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెర్వు గ్రామానికి చెందిన సీనియర్‌ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి (37) ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆయన స్వగ్రామమైన మద్దెలచెర్వుకు వచ్చిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి దత్తురెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దత్తురెడ్డి భార్య, తల్లిని ఓదార్చారు. ఆయన భార్య ప్రియాంకకు ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఇద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించారు. జర్నలిస్టు దత్తు ండ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి వెంట ఎంపీ సురేష్‌ షెట్కర్‌, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, సంజీవ్‌ రెడ్డి,నల్గొండ, సీనియర్‌ జర్నలిస్టులు, తదితరులు ఉన్నారు. కాగా, జిల్లా పర్యటనలో భాగంగా బిచ్కుంద నుండి డోంగ్లి వరకు రూ.13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కర్‌, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, జిల్లా ఎస్పీ రాజేష్‌చంద్ర, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, జాయింట్‌ కలెక్టర్‌ విక్టర్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *