– కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నష్టాన్ని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయంతో పాటు ఉపశమన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని బీజేపీి కార్యకర్తలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆదేశించారు. ఈ క్లిష్ట సమయంలో మన ప్రధాన బాధ్యత బాధిత ప్రజలకు అండగా నిలబడడం.. ముఖ్యంగా పేదలు, రైతులు, దినసరి కూలీలు వంటి జీవనోపాధి కోల్పోయిన వారికి తక్షణ సహాయం చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యకర్తలు స్థానిక అధికారులతో, విపత్తు నిర్వహణ బృందాలతో, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుని అవసరమైన చోట ఆహారం, పునరావాసం, వైద్య సహాయం అందించాలని రామచందర్‌రావు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





