– \కేంద్ర మంత్రి బండి సంజయ్ వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7: బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే రాష్ట్రం పురోగమనిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ఉజ్వంలంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపాకు అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన హా ఇచ్చారు. ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో పలుచోట్ల బిజెపి బలం చాటిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ బిజెపిని ఆశీర్వదించాలన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో నిర్మించనున్న సింథటిక్ ట్రాక్ స్థలాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ పరిశీలించారు. స్థల విషయమై ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రణాళిక అభివృద్ధి కమిటీతో సక్షించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా జమ్మికుంట, హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.కోటి వ్యయంతో ఆధునిక పరికరాలను సమకూర్చానని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు చర్యలు తీసుకుంటామన్నారు. జమ్మికుంటలోని అంబేడ్కర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ ముంపు ప్రాంతాలను కాపాడతానని, వరదకాలువ నిర్మాణాన్ని చేపడతామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





