వేస‌వి మంట భ‌రించాల్సిందే

– మూడు నెలలు ఎండలు, వడగాడ్పులు
– భారత వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో ఈ వేసవి సీజన్ మొత్తం ఎండ మంట పుట్టించనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయని వాతావరణ వాఖ హెచ్చరించింది. రానున్న మూడు నెలలకు దేశంలో వాతావరణ పరిస్థితులు, ఎండలు, వడగాడ్పులు, వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బులెటిన్ విడుదల చేసింది. వచ్చే మూడు నెలలు రాష్ట్రం నిప్ప్పుల కొలిమిలా మారే అవకాశం ఉంది. ఏపీతోపాటు ఒడిశా, తెలంగాణలో కొంత భాగం, పశ్చిమ బెంగాల్, బిహార్, యూపీ, ఈశాన్య రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకానున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయి. ఈ మూడు నెలల్లో ఎక్కువ రోజులు వడగాడ్పులు వీయనున్నాయి. ఏప్రిల్‌లో సగటున మూడు, నాలుగు రోజులు, మే, జూన్ నెలల్లో పది, అంతకంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తాయి. రాత్రి వాతావరణం కూడా వేడిగానే ఉండనుంది. దేశంలోని 95 శాతం ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఏప్రిల్‌లో ఈశాన్య రాష్ట్రాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానుంది. మార్చిలో సాధారణ వర్షపాతం 29.9 మిల్లీవిÖటర్లకుగాను 33.7 మిల్లీవిÖటర్లు నమోదైంది. 1901 నుంచి ఇప్పటి వరకు మార్చిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడం ఇది 32వ సారి. పసిఫిక్ మహాసముద్రంలో లానినా చివరి దశకు చేరుకుంది. కొద్ది రోజుల్లో తటస్థ పరిస్థితులకు చేరుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ మోడల్స్ వెల్లడిస్తున్నాయి. దీనికనుగుణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు తటస్థ పరిస్థితులు కొనసాగుతాయని, జూన్ (నైరుతి రుతుపవనాల ప్రారంభం) నుంచే ఎల్‌నినో మొదలవుతుందని ఐఎండీ అంచనా వేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *