మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ 

– శాసనసభా పక్షనాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక
– కార్యక్రమానికి దూరంగా శరద్ పవార్, సుప్రియా సూలె

ముంబై, జనవరి 31: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని లోక భవన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర పద్న విస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మహాయుతి మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్సీపీ నేతలు శరద్ పవార్, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా సునేత్ర పవార్ గుర్తింపు పొందారు. అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయన స్థానంలో సునేత్రను ఎంపిక చేశారు. రాజ్యసభ స‌భ్యురాలైన‌ ఆమె శనివారం ఉదయం ముంబైలోని విధాన్ భవన్కు చేరుకున్నారు. అక్కడ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సునేత్రా పవార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా ‘ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లెజిస్లేటివ్ బిల్డింగ్లో జరిగిన సమావేశంలో సునేత్ర పేరును ఎమ్మెల్యే దిలీప్ వాల్పే పాటిల్ ప్రతిపాదించగా, ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్బుల్ బలపచారు. అనంతరం ఏకగ్రీవంగా పార్టీ శాసనసభాపక్ష నేతగా సునేత్ర ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, దివంగత అజిత్అదా పవార్ కలలను సాకారం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తారనే నమ్మకం తనుకుందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *