ఏఐ ‌సమ్మిట్‌ ‌కోసం భారత్‌కు సుందర్‌ ‌పిచాయ్‌

-‌ ప్రధాని మోదీతో భేటీ

న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: సాంకేతిక ప్రపంచంలో భారత్‌ ‌తన ముద్ర వేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ ‌సమ్మిట్‌-2026లో పాల్గొనేందుకు గూగుల్‌, ఆల్ఫాబెట్‌ ‌సీఈఓ సుందర్‌ ‌పిచాయ్‌ ‌బుధవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ-సుందర్‌ ‌పిచాయ్‌ ‌మధ్య జరిగిన ఈ సమావేశం ప్రధానంగా కృత్రిమ మేధ, డిజిటల్‌ ‌మౌలిక సదుపాయాల చుట్టూ సాగినట్లు సమాచారం. ఈ ‌శిఖరాగ్ర సమావేశంలో 20న సుందర్‌ ‌పిచాయ్‌ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా సుందర్‌ ‌పిచాయ్‌ ఎక్స్‌లో ఓ పోస్ట్ ‌చేశారు. ’ఏఐ ఇంపాక్ట్ ‌సమ్మిట్‌ ‌కోసం భారత దేశానికి తిరిగి రావడం ఆనందంగా ఉంది. ఎప్పటిలాగే చాలామంది మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారు’ అంటూ రాసుకొచ్చారు. ఈ సదస్సులో 110కి పైగా దేశాలు, 30 అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *