– పులకించిన భక్తజనం
అయోధ్య, మార్చి 27: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్యలోని భవ్య రామమందిరంలో అద్భుత ఘట్టం ఆవి ష్కృతమైంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ము హూర్తంలో బాల రాముడి నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా మెరిసిపోయాయి. సైన్స్, ఆధ్యాత్మికత కలబోతగా జరిగిన ఈ సూర్య తిలకం విశేషాన్ని చూసి లక్షలాది మంది భక్తులు పులకించి పోయారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సూర్య తిలక వేడుకను నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై కొన్ని నిమిషాలపాటు ఈ కాంతి తిలకం రామ్ లల్లాను ప్రకాశింపజేసింది. ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తల నేతృ త్వంలో రూపొందించిన ఆటోమెకానికల్ సిస్టమ్ ద్వారా సూర్య కిరణాలు నేరుగా విగ్రహంపై పడేలా ప్లాన్ చేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు దేశవిదేశాల నుండి భక్తులు భారీగా తరలివచ్చా రు. ఆలయ ప్రాంగణంతోపాటు అయోధ్య అంతటా ఏర్పాటు చేసిన భారీ ఎల్ ఈ డీ స్క్రీన్ల ద్వారా భక్తులు ఈ వేడు కను ప్రత్యక్షంగా వీక్షించారు. సూర్య కిరణం రామ్ లల్లా నుదుటిపై పడగానే భక్తులు జై శ్రీరామ్ అంటూ చేసిన నినాదాలతో అయోధ్య నగరం మారుమోగింది. శ్రీరాముడికి సూర్య భగవానుడే స్వయంగా తిలకం దిద్దినట్లుగా ఉన్న ఈ దృశ్యం సోషల్ మీ డియాలో వైరల్ గా మారింది. ఈ అద్భుతం భక్తులకు కనువిందు చేయడమే కాక భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





