– అది అట్టర్ ఫ్లాప్ అయింది : హరీష్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 10: కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు.. భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ అంటూ సోషల్ విూడియా ఎక్స్ వేదికగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అందాల పోటీల్లాగే, ఏఐ సమ్మిట్‌లాగే.. గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయిందన్నారు. పెట్టుబడుల కట్టు కథలు చెప్పి కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్‌ను అట్టర్ ఫ్లాప్ చేశారంటూ ఫైర్ అయ్యారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాంకు తెరతీశారంటూ ఆరోపించారు. ’విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదు.. దాన్ని చేరుకునే మిషన్ లేదు.. విజన్ డాక్యుమెంట్ కాదు.. ’విజన్ లెస్’ డాక్యుమెంట్. క్యూర్, ప్యూర్, రేర్ అంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్. గ్లోబల్ సమ్మిట్‌లో ఎంవోయూల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవు. రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి? ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బ్లెయిర్, సుబ్బారావు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని ఆయన అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




