రాష్ట్రం ద‌శ మార్చ‌నున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్‌

– మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈనెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ తో రాష్ట్రం దిశ దిశ మారుతుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మీర్ ఖాన్ పేట్ లో జరుగుతున్న సమ్మిట్ ఏర్పాట్లను ఆదివారం ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ఈ ప్రపంచ స్థాయి సమ్మేళనంతో ప్రపంచ నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ చేరుతుందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం రెండేళ్ల పాలన, 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలు తదితరాలకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన 150 మంది అత్యంత ప్రముఖులు ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారని తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనం కోసం విశేష రీతిలో ఏర్పాట్లు జరిగాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *