సమ్మిట్‌ ప్రాంగణానికి రెండో రోజూ భారీగా సందర్శకులు

– కల్చరల్‌ హెరిటేజ్‌ అండ్‌ నెక్స్ట్‌-జెన్‌ టూరిజంపై సదస్సు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్‌ కంపెనీల స్టాళ్లను రెండో రోజు గురువారం పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. రెండో రోజు డిస్కవర్‌ తెలంగాణ.. కల్చరల్‌ హెరిటేజ్‌ అండ్‌ నెక్స్ట్‌-జెన్‌ టూరిజం అనే అద్భుతమైన సదస్సుతో ప్రారంభమైంది. వివిధ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. తెలంగాణ చరిత్ర, మ్యూజియం సంస్కృతి, పర్యాటక అభివృద్ధి, ఆహార సంస్కృతి తదితర విభిన్న కోణాల్లో విలువైన విశ్లేషణలను వక్తలు వివరించారు. తెలంగాణను ప్రపంచస్థాయిలో ఒక సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను వివరించారు. సదస్సులో డాక్టర్‌ మామిడి హరికృష్ణ, బిరద్‌ రాజారామ్‌, పి.పద్మావతి, గోపి బైల్లుప్పాలలు మాట్లాడారు. అనంతరం తెలంగాణ రైజింగ్‌- ఎంపవరింగ్‌ ఆల్‌, గ్రోవింగ్‌ టుగెదర్‌ అనే సదస్సులో ప్రముఖులు విద్యార్థులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్‌, మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌, హ్యాండీక్రాఫ్ట్స్‌, టూరిజం, ఎడ్యుకేషన్‌, కరీంనగర్‌ ఇక్కత్‌, ఫిలిగ్రి, చేర్యాల పెయింటింగ్స్‌, సైబర్‌ క్రైమ్‌ ఛేెదనలో ఉపయోగించే పలు ఆధునాతన పరికరాలు, డ్రోన్స్‌, రోబో తదితర 27కు పైగా స్టాళ్లను సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కాగా, శుక్రవారం ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ సదస్సును సందర్సించవచ్చని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *