‘స‌మ్మిట్‌’ చివ‌రి రోజు భారీగా సంద‌ర్శ‌కులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13ః ఫ్యూచ‌ర్ సిటీలో ఈ నెల 8 , 9వ తేదీలలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వహించిన గ్లోబ‌ల్ సమ్మిట్ ప్రాంగణాన్ని చివరి రోజైన శనివారం రైతులు, విద్యార్థులతోపాటు ఇత‌రులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. ఉదయం నిర్వ‌హించిన సెష‌న్‌లో ప్రస్తుత పద్ధతుల నుండి భవిష్యత్తు శ్రేయస్సు వరకు రైతుల ఆదాయాన్ని పెంచడానికి అరుదైన వ్యూహంపై, మధ్యాహ్నం వ్యవసాయం గ్రామీణ పరివర్తన- గ్రామీణ తెలంగాణను పట్టణ అవకాశాలతో అనుసంధానించే అంశాల‌పై రైతులకు, విద్యార్థులకు రెండు పర్యాయాలు సెమినార్ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా నుండి వచ్చిన ఆదర్శ మహిళా రైతు లావణ్య సేంద్రీయ వ్యవసాయ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ సినీ గాయని మంగ్లీ గీతాలు ఆలపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *