24 ‌నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

– ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌2: ఈ ‌నెలాఖరు నుంచి స్కూళ్లకు సెలవులు ప్రారంభం కానున్నాయి. నెలాఖరులోగా సిలబస్‌ ‌పూర్తి చేసి, పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఇప్టపికే ఆదేశాలు ఇచ్చింది. ఎండలు దంచికొడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. వేసవి సెలవుల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని స్కూళ్లకు సెలవులను అధికారులు ముందుగానే ప్రకటించారు. విద్యాశాఖ తాజా ప్రకటన ప్రకారం స్కూళ్లకు ఈ ఏడాది ఏకంగా 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. 24‌వ తేదీ నుంచి జూన్‌ 11‌వ తేదీ వరకు ఈ సెలవులు అమల్లో ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ ‌పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం జూన్‌ 12‌న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సెలవులు ప్రారంభమయ్యే లోపు సిలబస్‌ ‌పూర్తి అయ్యేలా చూడాలని ప్రభుత్వం పాఠశాలల యాజమాన్యాలకు సూచించింది. అవసరమైతే విద్యాపరంగా ఎలాంటి అంతరాయం లేకుండా  వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించవచ్చని తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *