ఎండలతో ఉక్కిరిబిక్కిరి

రాష్ట్రంలో పొడి వాతావరణం  
మరో రెండు రోజుల్లో వర్షాలకు అవకాశం : వాతావరణ శాఖ
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రాగల మూడు నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించనున్నది.

అనంతరం 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారంబుధవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములుమెరుపులుఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్‌ ‌భూపాలపల్లిములుగుభద్రాద్రి కొత్తగూడెంఖమ్మంనల్గొండసూర్యాపేటమహబూబాబాద్‌‌వరంగల్‌‌హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ‌జారీ చేసింది. అలాగేఈ నెల 13 వరకు రాష్ట్రంలో పలుచోట్ల అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉం‌దని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *