‘స్థానికం’లో కాషాయ జెండా ఎగురవేస్తాం

– బీజేపీ రాష్ట్ర చీఫ్‌ ‌రామచందర్‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29: ‌స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ ‌రామచందర్‌రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలస్యమైనా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రపతి, గవర్నర్‌ల పేరిట కాలయాపన చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రెండేళ్లకే కాంగ్రెస్‌ ‌మీద ప్రజలకు విరక్తి కలిగిందని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్‌ ‌ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాంచందర్‌ ‌రావు తమ గెలుపునకు స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం కాబోతున్నాయని ఉద్ఘాటించారు. తమకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారని గుర్తుచేశారు. తాను స్వయంగా ఇప్పటివరకు 23 జిల్లాల్లో యాత్రలు చేశానని తెలిపారు. ఇంకో నాలుగు జిల్లాల్లో యాత్ర చేయాల్సి ఉందని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను తామే గెలువబోతున్నామని రాంచందర్‌ ‌రావు ధీమా వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *