– వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
న్యూదిల్లీ, మార్చి 16 : వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రా ల్లో ఎల్పీజీ స్టాక్ ఉందని తెలిపింది. హర్మూజ్ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయని, శివాలిక్ నౌకలో 48 వేల మెట్రి క్ టన్నుల గ్యాస్ ఉందని కేంద్రం వెల్లడించింది. ఖతార్ నుండి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ బయలుదేరిన శివాలిక్ నౌక సురక్షితంగా గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. కాగా, కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు మెల్లమెల్లగా మూతపడుతున్నాయి. హాస్టల్స్ మెనూను పూర్తిగా మార్చేశాయి. కేవలం ఒక కర్రీతో సరిపెడుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా పలు దేవాలయాలు తాత్కాలికంగా ప్రసాదం తయారీని నిలిపివేశాయి. సీఎన్జీ బంకుల్లోనూ గ్యాస్ నిల్వలు అడుగంటుతున్నాయి. దీని కారణంగా గ్యాస్ తో నడిచే వందలాది ఆటోలు నిలిచిపో
తున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కూడా కష్టాలు తప్పటం లేదు. బుకింగ్, డెలివరీ విషయంలో నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సిలిండర్ కోసం వినియోగదారులు గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్నారు. యుద్ధ పరిస్థితులకుతోడు పండగ సమయం కావటంతో గ్యాస్ సిలిండర్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా జనం గంటలతరబడి క్యూ లైన్లో నిలబడి సిలిండర్ తీసుకుంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





