కార్మికుల పక్షపాతి సురవరం

– విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ
– విద్యార్థులతో కలిసి ఎన్నో ఉద్యమాలు
– సుధాకరనరెడ్డి సంస్మరణ సభలో నివాళులర్పించిన నేతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సురవరం సుధాకర్‌రెడ్డి పనిచేశారని విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. వారి ఇబ్బందులపై పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ సభ్యుడిగా నివేదికలు ఇచ్చారని గుర్తు చేశారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. తనకు కూడా వామపక్ష భావజాలం పట్ల అభిమానం ఉందన్నారు. సురవరం ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారని కొనియాడారు. దివంగత సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ రవీంద్రభారతిలో నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు. దశాబ్దానికిపైగా సురవరం, తాను కలిసి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినట్లు బీవీ రాఘవులు తెలిపారు. అనేక పోరాటాలు, ఉద్యమాల్లో కలిసి పనిచేశామని వివరించారు. సురవరం గొప్ప ప్రజాస్వామికవాది అని కొనియాడారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. సుధాకర్‌ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కమ్యూనిస్టులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా ఉన్నప్పుడు తొలిసారి సురవరం సుధాకర్‌రెడ్డిని కలిసినట్లు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో మళ్లీ కలిసినట్లు చెప్పారు. కమ్యూనిజం ఎప్పుడూ సజీవంగా ఉంటుందన్నారు. సురవరం నిబద్ధతతో రాజకీయాలు నడిపారన్నారు. ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శమని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *